close
Published : 02/08/2020 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మోహన్‌బాబు ఫాం హౌస్‌ వద్ద కారు కలకలం

రంగారెడ్డి: సినీ నటుడు మోహన్‌బాబు ఫాం హౌస్‌ వద్ద కారు కలకలం సృష్టించింది. జల్పల్లిలోని ఆయన ఫాం హౌస్‌లోకి కొంతమంది దుండగులు దూసుకెళ్లి... మిమ్మల్ని వదలమంటూ కుటుంబ సభ్యులను హెచ్చరించినట్లు సమాచారం. ఈ మేరకు పహాడిషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏపీ 31ఏఎన్‌ 0004 ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లు మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని