‘డర్టీ హరీ’ పోస్టర్‌పై వివాదం.. కేసు నమోదు - Case registered against Dirty Hari movie producer
close
Updated : 15/12/2020 10:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘డర్టీ హరీ’ పోస్టర్‌పై వివాదం.. కేసు నమోదు

హైదరాబాద్: ‘డర్టీ హరీ’ చిత్ర నిర్మాతపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. వెంకటగిరి ప్రాంతంలోని మెట్రో పిల్లర్లపై అతికించిన సినిమా పోస్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్త్రీల గౌరవాన్ని అవమానించేలా, యువతను తప్పుదోవ పట్టించే రీతిలో ‘డర్టీ హరీ’ సినిమా పోస్టర్లు ఉన్నాయని అందిన ఫిర్యాదుపై చిత్ర నిర్మాత శివ రామకృష్ణతోపాటు పబ్లిషింగ్ ఏజెన్సీలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

శ్రావణ్‌ రెడ్డి, రుహానీ శర్మ జంటగా నటించిన చిత్రం ‘డర్టీ హరీ’. ప్రముఖ దర్శకుడు ఎమ్‌.ఎస్‌ రాజు తెరకెక్కించారు. మార్క్‌ కె రోబిన్‌ సంగీతం సమకూర్చారు. శివ రామకృష్ణ, సతీష్‌ బాబు, సాయి పునీత్‌ సంయుక్తంగా నిర్మించారు. డిసెంబరు 18న ఫ్రైడే మూవీస్‌లో ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది. ఇటీవల విడుదల చేసిన సినిమా పోస్టర్లు, ట్రైలర్లలో శ్రుతిమించిన సన్నివేశాలు కనిపించాయి. దీంతో ఈ సినిమా సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. మరి ఈ కేసుపై నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవీ చదవండి..
టాలీవుడ్‌ నటుడిపై కన్నడ స్టార్స్‌‌ ఆగ్రహం
నటి మృతి: షాకింగ్‌ విషయాలు చెప్పిన స్నేహితురాలుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని