బ్రహ్మాజీపై ఆ నలుగురు పంచ్‌లే పంచులు..! - Cash Latest Promo 12th September 2020
close
Updated : 07/09/2020 11:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్రహ్మాజీపై ఆ నలుగురు పంచ్‌లే పంచులు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: సుమ వ్యాఖ్యాతగా ప్రతి శనివారం ఈటీవీలో ప్రసారమయ్యే ‘క్యాష్‌’ కార్యక్రమానికి విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులతో కలిసి సుమ చేసే సందడి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. సెప్టెంబరు 12న ప్రసారమయ్యే ‘క్యాష్‌’ ప్రోగ్రాం రెండింతలు వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. ఈసారి ఈ కార్యక్రమానికి నటుడు, సుమ భర్త రాజీవ్‌ కనకాలతో పాటు, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, సమీర్‌ విచ్చేయనున్నారు.

తాజాగా విడుదలైన సెప్టెంబరు 12న కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తెగ నవ్వులు పంచుతోంది. సుమ-బ్రహ్మాజీ ఒక వేదికపై ఉంటే వారి మధ్య నడిచే పంచ్‌ల హంగామా ఎలా ఉంటుందో అనేక సందర్భాల్లో ప్రేక్షకులు చూశారు. ఇప్పుడు వీరికి రాజీవ్‌, సమీర్‌, రాజా రవీంద్ర తోడయ్యారు. మరి సరదా సరదాగా సాగిపోయే ఆ ఎపిసోడ్‌ను చూడాలంటే శనివారం వరకూ ఆగాల్సిందే. అప్పటివరకూ సరదా సరదాగా సాగిపోయి ఈ ప్రోమోను చూడండి..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని