‘జబర్దస్త్‌’ లేడీస్‌... ఇవీ ఒరిజినల్‌ లుక్స్‌ - Cash latest promo
close
Published : 23/11/2020 00:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జబర్దస్త్‌’ లేడీస్‌... ఇవీ ఒరిజినల్‌ లుక్స్‌

హైదరాబాద్‌: సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ గేమ్‌ షో ‘క్యాష్’. ఎప్పటిలాగానే వచ్చే శనివారం ‘క్యాష్‌’‌లో కొంతమంది జబర్దస్త్‌ సెలబ్రిటీలు సందడి చేయనున్నారు. ‘జబర్దస్త్‌’లో లేడీ గెటప్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోన్న తన్మయి, శాంతి స్వరూప్‌, పావని, మోహన, వినోదిని, హరిత, సాయి తదితరులు... తమ ఒరిజినల్‌ రూపాన్ని చూపించనున్నారు. అలాగే తాము జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను ‘క్యాష్‌’ సెట్‌లో పంచుకోనున్నారు. ప్రోగ్రామ్‌లో భాగంగా మోహన్‌.. సుమను సరదాగా ‘ఆంటీ’ అంటూ నవ్వులు పూయించనున్నారు. అదే విధంగా వినోదినితో కలిసి సుమ ఓ సరదా స్కిట్‌ చేయనున్నారు. ‘సుమ వార్తలు’ కాన్సెప్ట్‌తో రానున్న ఈ స్కిట్‌లో భాగంగా వినోదిని వేసే బంతి సుమకు తాకగా.. మిగిలిన వారంతా ‘సుమ జిందాబాద్‌..వినోదిని డౌన్‌ డౌన్’ అంటూ వేసే పంచులు ఆకట్టుకోనున్నాయి. 

‘ఎప్పుడూ లేడీ గెటప్స్‌ అంటుంటారు కదా.. నిజం ఇలా ఉంటుంది’ అంటూ జబర్దస్త్‌ ‘లేడీ’స్‌ తమ నిజ రూపం చూపించనున్నారు. అలాగే పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి అని అందరినీ సుమ అడిగింది. ‘కుటుంబ పోషణ కోసం మాత్రమే ఈ గెటప్స్ వేస్తున్నాం.. వృత్తిపరంగా మాత్రమే చూస్తూ, నిజం ఇలా ఉంటుందని అర్థం చేసుకునే అమ్మాయి వస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటాం’ అని శాంతి స్వరూప్‌ చెప్పనున్నారు. అలాగే తమ జీవితానుభవాలను, ఎదుర్కొన్న కష్టాలను తెలియజేస్తూ కన్నీటి పర్యంతమవనున్నారు. వచ్చే శనివారం (నవంబర్‌ 28) ప్రసారం కానున్న ‘క్యాష్’ ప్రోమోను చూసేయండి..!



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని