close

తాజా వార్తలు

స్మితామేడమ్‌ ప్రేమలో విజయ్‌ దేవరకొండ

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ తన మూడో ప్రేయసిని పరిచయం చేశారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. క్రాంతిమాధవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్‌, ఇజబెల్లా లేట్చి, కేథరిన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ నలుగురు అమ్మాయిలను ప్రేమించే వ్యక్తిగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఐశ్వర్యా రాజేశ్‌, ఇజబెల్లా పాత్రలను పరిచయం చేసిన చిత్రబృందం తాజాగా కేథరిన్‌ పాత్రను తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా తన పాత్రను పరిచయం చేసుకుంటూ.. ‘బొగ్గు గనిలో నా బంగారం, వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌. ఈ ప్రేమికుల రోజున నేను ప్రేమించే యూనియన్‌ లీడర్‌ శ్రీనును కలవండి’ అని కేథరిన్‌ ట్వీట్‌ చేశారు. అదే సమయంలో విజయ్‌ దేవరకొండ సైతం ‘యూనియన్‌ లీడర్‌ శ్రీను, స్మితా మేడమ్‌‌’ అంటూ ఫొటోను పంచుకున్నారు.

ఈ సినిమా టీజర్‌ను జనవరి 3న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీసుందర్‌ బాణీలు అందిస్తున్నారు. క్రియేటివ్‌ కమర్షియల్‌ పతాకంపై కేఏ వల్లభం, కె.ఎస్‌ రామారావులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.