మీరు మరెంతో కాలం దేశానికి సేవ చేయాలి - Celebrities Wishes To PMModi
close
Updated : 17/09/2020 12:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీరు మరెంతో కాలం దేశానికి సేవ చేయాలి

ప్రధానికి సినీలోకం ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌: భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ గురువారం 70వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలీవుడ్‌, టాలీవుడ్‌ చిత్రపరిశ్రమలకు చెందిన పలువురు సెలబ్రిటీలు ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకోగా.. మరికొంతమంది సెలబ్రిటీలు మోదీతో దిగిన ఫొటోలను నెట్టింట్లో పోస్ట్‌ చేశారు.

‘మన ప్రియ ప్రధాని శ్రీ నరేంద్రమోదీకి 70వ జన్మదిన శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో మీరు మరెన్నో సంవత్సరాలు మన దేశానికి సేవ చేయాలని ఆశిస్తున్నాను’ - చిరంజీవి

‘దేశ ప్రధాని శ్రీ నరేంద్రమోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ పటిష్టమైన నాయకత్వం, విజన్‌ మన దేశ అభివృద్ధిలో గొప్ప మార్పులు తీసుకువచ్చింది. మీరు ఇలాగే ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను’ - మహేశ్‌బాబు

‘మన భారతదేశం బాగుపడాలంటే, దేశవిదేశాల్లో మన భారతదేశం గురించి చెప్పుకోవాలంటే, మోదీ జీవితాంతం భారత ప్రధానిగా ఉండాలి. అప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది. మన భరతమాత ముద్దు బిడ్డ.. ప్రధాని మోదీ వంద సంవత్సరాలు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను’ - మోహన్‌బాబు

‘పుట్టినరోజు శుభాకాంక్షలు నరేంద్రమోదీ జీ. ప్రతిరంగంలో ముఖ్యంగా విద్యారంగంలో మీరు చేపడుతున్న ఎన్నో సంస్కరణలు చూసి సంతోషంగా అనిపిస్తుంది. మన దేశాన్ని మరింత దృఢంగా తయారు చేస్తున్నందుకు ధన్యవాదాలు’ - మంచు విష్ణు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని