close

తాజా వార్తలు

Published : 08/08/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

PICS: చేనేత వస్త్రాల్లో మెరిసిన తారలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: చేనేత.. భారతదేశ వారసత్వ సంపదలో భాగం. దేశ ఔన్నత్యం, వైవిధ్యం, కళాత్మకతను శతాబ్దాలుగా నిలబెడుతూ వచ్చిన ఈ రంగాన్ని ఆదుకోవడం అందరి ముందున్న లక్ష్యం. ఈ లక్ష్యంతో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు చేనేత వస్త్రాల్లో మెరిశారు. వాటిని ధరించి నేతన్నలకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తాము చేనేత వస్త్రాలను ధరించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి తళుక్కుమన్నారు. 

భారతీయ చేనేత వస్త్రాలు ప్రత్యేకమైనవి. హస్తకళ ఎంతో గొప్పది. చేనేత పరిశ్రమను, చేతివృత్తుల వారికి మద్దతుగా భారతీయ వస్త్ర పరిశ్రమకు అండగా నిలుద్దాం -  ప్రియాంకా చోప్రా


దేశం గర్వించదగిన చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం. ఎంతోమంది చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్నారు. మీరు ఆ ఉత్పత్తులను ఎంచుకుంటే.. వారికి సాయం చేసిన వారవుతారు. మాతృభూమి ఉత్పత్తులను ఎంపిక చేసుకోండి. ఈ భూమ్మీద ఉన్న ప్రతి దాన్ని ప్రేమించండి - కంగనా రనౌత్‌


ఇది నాకెంతో ఇష్టమైన, చాలా ప్రత్యేకమైన చేనేత చీర. చేతి వృత్తుల వారి కళా నైపుణ్యం, సృజనాత్మకత ప్రపంచంలోనే ఎంతో ఉత్తమమైనది - జాన్వీ కపూర్‌ 


నేషనల్‌ హ్యాండ్‌లూమ్‌ డే. వోకల్‌ ఫర్‌ హ్యాండ్‌ మేడ్‌ - నభా నటేశ్‌


చేనేతకు మద్దతుగా నిలవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ఏదో ఒక ఉత్పత్తి కొనండి. తద్వారా ఈ విపత్కర పరిస్థితుల్లో కళాకారుల కుటుంబాలకు కొంత సాయం చేసినవాళ్లమవుతాం. నేను వోకల్‌ ఫర్‌ లోకల్‌. మరి మీరు? -రుక్షార్‌ దిల్లాన్‌


భారత్‌లో అద్భుతమైన చేతివృత్తుల వారు ఉన్నారు. ఈ రోజున చేనేత కార్మికులకు, హస్తకళాకారులకు మద్దతుగా నిలుద్దాం - రవీనా టాండన్‌


దేశంలోని చేనేత కార్మికులను గౌరవించుకునేందుకు, భారత చేనేత పరిశ్రమకు ప్రేరణనిచ్చేందుకు ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం - సోనూ సూద్‌, నటుడు


 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.