సోషల్‌ లుక్‌: సామ్‌ సూపర్‌.. స్నేహకు సర్‌ప్రైజ్‌ - Celebrities social media accounts round up
close
Published : 13/10/2020 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: సామ్‌ సూపర్‌.. స్నేహకు సర్‌ప్రైజ్‌

* కథానాయిక సమంత మరోసారి తన ఫిట్‌నెస్‌ గోల్స్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచారు. తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి కసరత్తులు చేస్తున్న వీడియోలు షేర్‌ చేశారు.

* కథానాయకుడు రవితేజ ‘క్రాక్‌’ సినిమా మేకింగ్‌ వీడియోను పంచుకున్నారు. కరోనా నేపథ్యంలో చిత్ర బృందం మాస్కులు ధరించారు. అన్నీ జాగ్రత్తల నడుమ షూటింగ్‌ జరుగుతోంది.

* నటి శిల్పాశెట్టి మనాలీలో ఉన్నారు. అక్కడి ప్రకృతి అందాల మధ్య తెల్లవారుజామున వ్యాయామం చేస్తున్న వీడియోను ఆమె షేర్‌ చేశారు. అదేవిధంగా ఈషా రెబ్బా జిమ్‌ వీడియో పంచుకున్నారు.

* నటి స్నేహ పుట్టినరోజు సందర్భంగా ఆమె భర్త, నటుడు ప్రసన్న ఘనంగా వేడుకలు నిర్వహించారు. తన భర్త సర్‌ప్రైజ్‌ చేశారని, ఆయన తన జీవితంలోకి రావడం అదృష్టమని ఈ సందర్భంగా స్నేహ ఫొటోలు షేర్‌ చేశారు.

* జీవితంలో సంతోషంగా ఉండటం గురించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ముచ్చటించారు. రూ.లక్షల కోట్లు ఉన్నంత మాత్రాన ఆనందం రాదని, అది మన నుంచే పుట్టాలని వివరించారు.
* ‘ఈ ఏడాది దాదాపు పూర్తయింది. జీవితానికి కావాల్సిన అనేక విషయాలు నేర్చుకున్నా. ఎన్నో కళల గురించి తెలుసుకున్నా.. ఇతరులకు నేనెంత ప్రాధాన్యం ఇస్తానో తెలిసింది...’ అంటూ నటి శ్రుతి హాసన్‌ 2020లో తన అనుభవాల్ని పంచుకున్నారు. ఇలా మన తారలు షేర్‌ చేసిన ఆసక్తికర విషయాలు మీ కోసం..




















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని