చిరు.. త్వరగా కోలుకోండి - Celebrity Wishes For Chiranjeevi
close
Published : 09/11/2020 14:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు.. త్వరగా కోలుకోండి

సినీ ప్రముఖుల వరుస ట్వీట్లు

హైదరాబాద్‌: తాను కరోనా బారిన పడినట్లు అగ్రకథానాయకుడు చిరంజీవి అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభించాలనే ఉద్దేశంతో కరోనా పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చిరు వెల్లడించారు. దీంతో ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్‌మీడియా వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు.

‘నీకోసం కాకుండా ఎదుటివారి కోసం నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం.. నీ చుట్టూ ఉన్నవారు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నావు. నీ గొప్ప ఆలోచనలతో నువ్వు ఎంతోమందికి స్ఫూర్తి. అన్నయ్య నువ్వు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’ - నాగబాబు

‘చిరు సర్‌. మీరు కరోనాని జయించి ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను’ - నిఖిల్‌

‘మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి.’ - రవితేజ

‘చిరంజీవి సర్‌.. మీరు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యవంతులుగా తిరిగి రండి. హనుమంతుడి ఆశీస్సులు ఎప్పటికీ మీతో ఉంటాయి. మిమ్మల్ని మేము ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’ - దేవిశ్రీ ప్రసాద్‌

‘మీరు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను సర్‌’ - నితిన్‌

‘మామయ్య.. మీరు త్వరితగతిన కోలుకోవాలని ఆశిస్తున్నాను’ - ఉపాసన

‘త్వరలో మీరు యథావిధిగా షూటింగులో పాల్గొంటారు.. కోట్లాదిమంది అభిమానుల ప్రార్థనలు మీతో ఉన్నాయి సర్’ - రామజోగయ్య శాస్త్రిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని