‘‘లాక్‌డౌన్‌లో ఓ మంచి వార్త విన్నాను’’
close
Published : 01/07/2020 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘‘లాక్‌డౌన్‌లో ఓ మంచి వార్త విన్నాను’’

చైనా యాప్స్‌ నిషేధంపై సినీ ప్రముఖుల స్పందన

భారతదేశ భద్రత దృష్ట్యా టిక్‌టాక్‌ సహా చైనాకు చెందిన 59 యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ ఈ నిర్ణయానికి మద్దతు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా చైనాను దెబ్బతీస్తేనే ఆ దేశం పొగరు అణుగుతుందని చెప్పారు.

‘‘చైనా యాప్స్‌ను ప్రభుత్వం నిషేధించగానే చాలా మంది సంబరాలు చేసుకోని ఉంటారు. ఎందుకంటే మన దేశ ఆర్థిక వ్యవస్థలోకి చైనా ఎంతలా చొచ్చుకొచ్చిందో అందరికీ తెలుసు. మన వర్తక వ్యాపారాలు చాలా వరకు ఆ దేశంపైనే ఆధారపడి ఉన్నాయి. కానీ, ఈ ఏడాది చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని కష్టాల్లోకి నెట్టింది. ఇలాంటి సంక్షోభ సమయంలో వాళ్లు మన సరిహద్దుల్లో గొడవలకు దిగుతున్నారు. వాళ్లకి కేవలం లద్దాఖ్‌ ఒకటే కాదు.. అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, అస్సాం ఇలా అన్నింటినీ కైవసం చేసుకోవాలన్న పథకంతో ఉన్నారు. అంతేకాదు కరోనాతో ప్రపంచంపై బయోవార్‌కు దిగారు. వారికి ముఖ్యమైనది ఆర్థిక వ్యవస్థ. భారత్‌లో చైనా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తే ఆ దేశ దుష్ట అధికారాలు కూడా తగ్గుతాయి. అప్పుడే ప్రపంచం మంచి స్థాయిలో ఉంటుంది’’ అని కంగనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చైనా యాప్స్‌ నిషేధించిన నేపథ్యంలో దేశీయ ప్రొడక్ట్స్‌ను ఉపయోగించాలని కంగనా ప్రజలను కోరారు.

దేశ భద్రత దృష్ట్యా భారత ప్రభుత్వం తీసుకున్న ఈ యాప్స్‌ నిషేధంపై నమ్మకం ఉంచండి. అది పక్కన పెడితే.. సోషల్‌ మీడియాకు బానిసవ్వడం, మానసిక ఆరోగ్యం మనకు తెలిసిన విరోధులు. వాటికి కాస్త విరామం ఇవ్వండి. బానిసత్వం నుంచి బయటపడటానికి, ఆత్మపరిశీలన చేసుకోవడానికి సహకరిస్తుంది - అమృత రావ్‌

లాక్‌డౌన్‌లో ఓ మంచి వార్త విన్నాను. మొత్తానికి కొంతమంది హాస్యాస్పదమైన వీడియోలు చూడాల్సిన పనిలేదు - మలైకా అరోరా

మేం ఎప్పుడైనా యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేయగలం - రీచా చద్దామరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని