close

తాజా వార్తలు

ఆర్జీవీ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్‌

హైదరాబాద్‌: టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం బ్యూటిఫుల్ (ట్రిబ్యూట్ టు రంగీలా). నైనా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సూరి హీరో. అగస్త్య మంజు దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్‌ బోర్డ్‌ ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని తెలియచేస్తూ చిత్ర బృందం సభ్యులు విలేకర్లతో మాట్లాడారు. ‘‘బ్యూటిఫుల్‌’ చిత్రానికి సెన్సార్‌ పూర్తయ్యింది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు ‘ఏ’ సర్టిఫికేట్‌ ఇచ్చింది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం. రొమాంటిక్‌ ప్రేమ కథాంశంతో వైవిధ్యభరితంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సూరి, నైనా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సన్నివేశాలతో పాటు పాటలు హత్తుకుంటాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం  ట్రైలర్‌కు విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. అలాగే సినిమా కూడా సాంతం అలరిస్తుంది’ అని చిత్ర బృందం తెలిపింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.