రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌.. కేంద్రం నిర్ణయిస్తే చాలదు! - Centre alone cant decide lockdown in state slams Mamata Banerjee
close
Published : 03/09/2020 02:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌.. కేంద్రం నిర్ణయిస్తే చాలదు!

రాష్ట్రాలపై విశ్వాసం ఉంచాలి: మమతా బెనర్జీ

కోల్‌కతా:  రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించే అంశంపై కేంద్రం ఒక్కటే నిర్ణయం తీసుకుంటే చాలదని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ పెట్టాలో, వద్దో కేంద్రం ఒక్కటే నిర్ణయించకూడదని, దాన్ని అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వాలపై విశ్వాసం ఉంచి వాటికి పూర్తి అధికారాలు ఇవ్వాలని కోరారు. సమాఖ్యవాదానికి అదే పునాది అని, అంతా సహకరించుకొని ముందుకెళ్లాల్సిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం ఆదేశాలు మాత్రమే ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలేంటో జిల్లా యంత్రాగానికి తెలుస్తాయన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్‌లు మినహా మిగతా చోట్ల లాక్‌డౌన్‌ పెట్టాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరంటూ  అన్‌లాక్‌-4 మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొనడంపై దీదీ మండిపడ్డారు. 

మెట్రో సర్వీసుల పునరుద్ధరణ వాయిదా
రాష్ట్రంలో కరోనా ప్రభావంతో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కోల్‌కతా మెట్రో సర్వీసుల పునరుద్ధరణ చర్యలను ఈ నెల 15 వరకు వాయిదా వేస్తున్నట్టు  దీదీ చెప్పారు. ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయన కార్యాలయం సమీక్షించి ఎప్పటి నుంచి మెట్రో రైలు సేవలను పునఃప్రారంభించాలో తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. 

కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న వేళ పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం కంటైన్‌మెంట్‌ జోన్‌లలో సెప్టెంబర్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే, ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ నెల 7, 11, 12 తేదీల్లో బెంగాల్‌ వ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని