జడేజాకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా చాహల్‌ - Chahal replaces concussed Jadeja in Indian team
close
Updated : 04/12/2020 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జడేజాకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా చాహల్‌

ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌×ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టీ20లో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా స్పిన్నర్‌ చాహల్ మైదానంలోకి వచ్చాడు. టీమిండియా ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో స్టార్క్‌ వేసిన బౌన్సర్‌ జడేజా హెల్మెట్‌కు బలంగా తాకింది. దీంతో కంకషన్‌కు గురైన అతడి స్థానంలో చాహల్‌ మైదానంలోకి వచ్చాడని బీసీసీఐ ట్విటర్‌లో పేర్కొంది. ప్రస్తుతం జడేజా ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం పరిశీలిస్తోందని తెలిపింది. కాగా, జడేజా ఆఖర్లో ఆసీస్‌ బౌలర్లపై విరుచుకుపడంతో భారత్‌ 161 పరుగులు చేసింది. అతడు 23 బంతుల్లో అజేయంగా 44 పరుగులు చేశాడు.

మరోవైపు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన చాహల్‌ బంతితో మాయచేస్తున్నాడు. కట్టుదిట్టంగా బంతులు వేసి ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడిచేస్తున్నాడు. రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే జడేజా స్థానంలో చాహల్ రావడంపై ఆస్ట్రేలియా కోచ్‌ లాంగర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విషయంపై మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌తో మాట్లాడాడు. కాగా, గత ఏడాది జులైలో ఐసీసీ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ నిబంధనలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ మధ్యలో ఆటగాడి తలకి గాయమైతే అతడి స్థానంలో వచ్చే సబ్‌స్టిట్యూట్ బౌలింగ్‌/బ్యాటింగ్‌ చేయవచ్చు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని