‘చందమామ’ శివశంకరన్‌ కన్నుమూత - Chandamama Artist Sivasankaran Passes away
close
Updated : 29/09/2020 23:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘చందమామ’ శివశంకరన్‌ కన్నుమూత

చెన్నై: ప్రముఖ చిత్రకారుడు కేసీ శివశంకరన్‌ (96) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ బాలల మాసపత్రిక ‘చందమామ’ ముఖచిత్రం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఆయన.. భేతాళ కథల బొమ్మలతో ప్రసిద్ధి పొందారు. 1951లో చందమామలో చేరిన శివశంకరన్‌.. 60 ఏళ్ల పాటు అందులోనే పనిచేశారు. ఆ పత్రికలో చిత్రకారుల బృందానికి శివశంకరన్‌ నేతృత్వం వహించారు. చందమామ మూతపడ్డాక ‘రామకృష్ణ విజయం’ పత్రికలో బొమ్మలు గీశారు. 93 ఏళ్ల వయసులోనూ మ్యాగజైన్‌కు శివశంకరన్‌ బొమ్మలు గీయడం విశేషం. ఆయన మృతిపట్ల పలువురు చిత్రకారులు సంతాపం తెలిపారు. 

శివశంకరన్‌ మరణం సాహిత్యలోకానికి తీరనిలోటని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. చందమామలో విక్రమార్‌-బేతాళ కథలకు శంకరన్‌ చిత్రరూపాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. ‘అంబులి మామ’గా ప్రసిద్ధిచెందిన విలక్షణ నటుడని, ఆయన చిత్రలేఖా నైపుణ్యం అద్వితీయమన్నారు. శంకరన్‌ చిత్రాలు చందమామ సంచికను మరోస్థాయికి చేర్చాయన్నారు. శంకరన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. 

కరతోలుపు శివశంకరన్‌ మరణం బాల సాహిత్యానికి తీరనిలోటని తెదేపా నేత నారా లోకేష్‌ అన్నారు. శంకరన్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు లోకేష్‌ తెలిపారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని