కిశోర్‌ మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి - Chandrababu pays Condolences to nalanda kishore
close
Published : 25/07/2020 14:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కిశోర్‌ మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

అమరావతి: ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అత్యంత సన్నిహితుడు నలందకిషోర్‌ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిశోర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైకాపా వేదింపులకు మనస్తాపంతో మృతి చెందడం బాధాకరమని ఆయన అన్నారు. ప్రభుత్వ దుశ్చర్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ‘‘ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెట్టాడని కేసులు బనాయించారు. కరోనా పరిస్థితుల్లో విశాఖ నుంచి కర్నూలుకు తరలించారు. పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిప్పి శారీరకంగా, మానసికంగా వేధించారు. ఈ క్షోభ తట్టుకోలేకే కిశోర్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆయన మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని