JKపై భారత్‌ది ఏకపక్ష నిర్ణయం: చైనా - China Syas Indias Decision On JK Is Illegal
close
Published : 06/08/2020 00:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

JKపై భారత్‌ది ఏకపక్ష నిర్ణయం: చైనా

బీజింగ్: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దు నిర్ణయానికి నేటికి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో పొరుగు దేశం చైనా భారత్‌పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ భారత్ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని పేర్కొంది. భారత్-పాక్‌లు కశ్మీర్ అంశంపై చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.

‘‘కశ్మీర్‌ ప్రాంతంలోని పరిస్థితులను చైనా నిశితంగా పరిశీలిస్తోంది. మా నిర్ణయం ఏంటనేది ఇప్పటికే తెలిపాం. ఇది భారత్-పాక్‌ మధ్య ఎంతో కాలంగా ఉన్న వివాదం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలకు, భారత్-పాక్‌ల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం ఇది. ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం చెల్లుబాటు కాదు. ఈ సమస్యను ఇరు వర్గాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి’’ అని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు.

గతేడాది లద్ధాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడంపై చైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. అయితే చైనా ఆక్రమించిన ఆక్సాయ్‌చిన్‌ తమ భూభాగంలోనిదని, చైనా ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని భారత్ గౌరవించాలని పేర్కొంది. అయితే చైనా వాదనను భారత్ తోసిపుచ్చింది. ఆక్సాయ్‌చిన్‌ లద్దాఖ్‌లో భాగమని తెలిపింది. అలానే లద్దాఖ్‌ను కేంద్ర ప్రాంత పాలితంగా ప్రకటించడం తమ అంతర్గత వ్యవహారమని వెల్లడించింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని