భారత్‌ను కట్టడి చేసేందుకు చైనా ‘ఉగ్ర’ఎత్తుగడ! - China using Pakistan as tool against India
close
Published : 23/10/2020 21:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌ను కట్టడి చేసేందుకు చైనా ‘ఉగ్ర’ఎత్తుగడ!

పాక్‌ ఉగ్రవాదాన్ని సాధనంగా వాడాలన్న దురాలోచన

వాషింగ్టన్‌: భారత్‌ను కట్టడి చేయడానికి చైనా ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా వినియోగించుకోవాలకుంటోందని అమెరికాకు చెందిన పబ్లిక్ పాలసీ రిసెర్చర్‌ మైఖేల్ రూబిన్ అభిప్రాయపడ్డారు. కాగా, పాకిస్థాన్‌ తన ఉగ్రవాద కార్యకలాపాలకు జవాబుదారీతనం నుంచి దౌత్యపరంగా రక్షించడానికి చైనాపై ఆధారపడుతున్నట్లు, ఆ ఉగ్రవాదాన్ని వాడుకొని భారత్‌ను వేధించాలని చైనా చూస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ ఎగ్జామినర్ అనే వెబ్‌సైట్‌లో మైఖేల్ ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. 

‘బీజింగ్ ఉగ్రవాదాన్ని నిరోధించే విషయంలో పెద్దగా నిబద్ధత చూపడం లేదు. ఇప్పటికే లద్దాఖ్ వద్ద భారత్‌ను ఇబ్బంది పెడుతున్న చైనా.. మరింత వేధింపులకు గురిచేసేందుకు పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని సాధనంగా వాడాలనే దురాలోచనతో ఉంది. పాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) కొరడా ఝుళిపిస్తున్నప్పటికీ.. అంతర్జాతీయ సమాజానికి జవాబుదారీ వహించే పరిస్థితి నుంచి తనను చైనా దౌత్యపరంగా రక్షిస్తుందని పాక్‌ భావిస్తున్నట్లు కనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.  కాగా, ఎఫ్‌ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశంలో పాకిస్థాన్‌ గ్రే లిస్ట్‌ లేక బ్లాక్‌ లిస్ట్‌లో ఉంటుందా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. ఇప్పటి వరకు బ్లాక్‌ లిస్ట్‌లో ఇరాన్‌, ఉత్తరకొరియా మాత్రమే ఉన్నాయి. ఆ జాబితాలోకి దిగజారకుండా ఉండేందుకు పాక్ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఎఫ్ఏటీఎఫ్ కళ్లు కప్పేందుకు ఉగ్రవాద కట్టడికి చర్యలు తీసుకున్నట్టుగా పాక్ ప్రభుత్వం నటిస్తోంది. 

అలాగే ఇటీవల పాకిస్థాన్ ఆర్థిక సలహాదారు అబ్దుల్ హఫీజ్‌ షేక్‌,  చైనా రాయబారి యావో జింగ్ మధ్య జరిగిన సమావేశం గురించి రూబిన్‌ ప్రస్తావిస్తూ..‘వారిద్దరూ ఎఫ్‌ఏటీఎఫ్ కట్టుబాట్ల గురించి చాలా తక్కువగా మాట్లాడగా, 60 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా, పాకిస్థాన్‌ ఆర్థిక నడవా గురించి ఎక్కువగా చర్చించారు. అయితే, పాకిస్థాన్‌ ఆర్థిక పరపతి, ఎఫ్ఏటీఎఫ్ జవాబుదారీ నుంచి ఆ దేశం బయటపడటంపైనే ఆర్థిక నడవా విజయం ఆధారపడి ఉంటుంది’ అని ఆయన అంచనా వేశారు. కాగా, పాక్‌ ఎఫ్ఏటీఎఫ్ హోదాపై శుక్రవారం చైనా వేసే ఓటు ఆ దేశ వైఖరిని వెల్లడి చేస్తుందన్నారు. దానికి సంబంధించిన మూడు రోజుల ప్లీనరీ సమావేశం శుక్రవారంతో ముగియనుంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని