చైనా అధ్యక్షుడి పాక్‌ పర్యటన వాయిదా - Chinese President Pakistan tour postponed
close
Published : 05/09/2020 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనా అధ్యక్షుడి పాక్‌ పర్యటన వాయిదా

భారత్‌ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే..!

దిల్లీ: చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్ పాకిస్థాన్‌ పర్యటన వాయిదా పడింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ పర్యటన వాయిదా పడినట్లు పాకిస్థాన్‌లోని చైనా రాయబారి యావో జింగ్‌ ప్రకటించారు. ఈ పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటుందనే విషయంపై ఇరు దేశాల అధికారులు చర్చిస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఆహ్వానం మేరకే చైనా అధ్యక్షుడు పాక్‌లో పర్యటించనున్నారని వెల్లడించారు.

అయితే, గతకొద్దికాలంగా భారత్‌-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే ఈ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో చైనా అధ్యక్షుడు పాకిస్థాన్‌కు వెళ్తే మరిన్ని అనుమానాలకు తావిస్తాయనే ఉద్దేశంతో చైనా ముందుజాగ్రత్త పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలాఉంటే, గతకొన్ని రోజులుగా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభనపై ఓవైపు భారత్‌-చైనా సైనికాధికారులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈ సందర్భంలో చైనా సైన్యం మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత సైన్యాన్ని రెచ్చగొడుతున్న విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని