90శాతం మంది ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్‌ - Chinese companys employees have taken covid vaccine
close
Published : 07/09/2020 13:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

90శాతం మంది ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్‌

చైనా సంస్థ సినోవాక్‌ వెల్లడి

బీజింగ్: చైనా సంస్థ సినోవాక్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను ఆ సంస్థకు చెందిన 90 శాతం మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల మీద పరీక్షించారు. అత్యవసర వినియోగ కార్యక్రమం కింద ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చినట్లు ఆ ఫార్మా సంస్థ సీఈఓ ఇన్‌ వీడాంగ్ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం మూడో దశ ప్రయోగాలు జరుపుకుంటున్న ఈ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగం కింద  కొన్ని వర్గాలకు చెందిన ప్రజలకు అందజేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. వారిలో వైద్య సిబ్బంది, ఆహార మార్కెట్లలో పనిచేసేవారు, రవాణా, సేవల విభాగంలో విధులు నిర్వహించే వారు ఉన్నారు. 

కాగా, ఈ వ్యాక్సిన్‌ను సినోవాక్‌కు చెందిన 2,000 నుంచి 3,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు స్వచ్ఛందంగా అందజేసినట్లు వీడాంగ్ వెల్లడించారు. ఈ కార్యక్రమం కింద వినియోగించిన వ్యాక్సిన్‌ సురక్షితమైదేనన్న ఆధారాలు వెలువడ్డాయని, కానీ, అది రిజిస్టర్‌ క్లినికల్ ట్రయల్‌లో భాగం కాదని చెప్పారు. ఈ వ్యాక్సిన్‌ను వాణిజ్యపరంగా వాడాలా, వద్దా అనే విషయాన్ని నియంత్రణ సంస్థలు నిర్ణయిస్తాయన్నారు. 

ఇదిలా ఉండగా, ఈ వ్యాక్సిన్‌ డోసును తీసుకున్న వాళ్లలో వీడాంగ్‌తో పాటు ఆయన భార్య, తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇంకా తుదిదశకు చేరని వ్యాక్సిన్‌ను వేసేందుకు ఎంచుకున్న వారికి దాని వల్ల కలగనున్న దుష్ప్రభావాల గురించి ముందుగానే తెలియజేశామన్నారు. అలాగే వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ప్రతికూల ప్రభావాలు కనిపించే రేటు చాలా తక్కువగా ఉంటుందన్నారు. జ్వరం, నొప్పి, కొన్ని స్వల్ప లక్షణాలు మాత్రం కనిపించాయని గతంలో నిర్వహించిన  ట్రయల్స్‌ ఫలితాలను  సంస్థ వెల్లడించింది. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి ప్రపంచ వ్యాప్తంగా పోటాపోటీగా వ్యాక్సిన్ల అభివృద్ధి జరుగుతోంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని