ఉచితంగా ప్లాస్మా అందిస్తోన్న చిరు బ్లడ్‌ బ్యాంక్‌ - Chiranjeevi Eye and Blood Bank supplies plasma
close
Published : 30/09/2020 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉచితంగా ప్లాస్మా అందిస్తోన్న చిరు బ్లడ్‌ బ్యాంక్‌

హైదరాబాద్‌: చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ పేద రోగులకు ఉచితంగా కొవిడ్‌-ప్లాస్మా అందిస్తోంది. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కరోనా బాధితులకు ఉచితంగా సరఫరా చేస్తోంది. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘పచ్చటి జీవితాలపై కర్కశ కరోనా పంజా విసురుతూ చిన్నాభిన్నం చేస్తోంది. పేద రోగులు చికిత్స పొందడం గగనమవుతోంది. ఈ పరిస్థితుల్లో పేద రోగుల్ని కరోనా బారి నుంచి కాపాడేందుకు చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో పేదలైన కరోనా సోకిన రోగులకు ఉచితంగా ప్లాస్మా వితరణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం’.

‘తెల్ల రేషన్‌ కార్డుదారులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ఉచితంగా ప్లాస్మా సరఫరా చేస్తోంది. పేదలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. కరోనా సోకి రోగ విముక్తులైన వారు ప్లాస్మాదానం చేస్తే మరికొంత మందికి ఆయుష్షు పోసినట్టే. 22 సంవత్సరాలుగా మెగాస్టార్‌ చిరంజీవి సొంత నిధులు వెచ్చించి 9 లక్షల 27 వేల మంది పేద రోగులకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఉచితంగా రక్త నిధులు అందించారు. ఈ సందర్భంగా ఆ విషయాన్ని తెలియజేయడం సంతోషంగా ఉంది’ అని సంస్థ సీఈవో ప్రకటన విడుదల చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని