పవన్‌ ఒక్కడే నా పాత్రకు సెట్‌ అవుతాడు: చిరు - Chiranjeevi On Tagore Remake
close
Published : 27/12/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ ఒక్కడే నా పాత్రకు సెట్‌ అవుతాడు: చిరు

టాలీవుడ్‌ హీరోల గురించి మెగాస్టార్‌ ఏమన్నారంటే..

హైదరాబాద్‌: చిరంజీవి కథానాయకుడిగా నటించిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథా చిత్రం ‘ఠాగూర్‌’. తమిళ చిత్రం ‘రమణ’ రీమేక్‌ తెరకెక్కిన ఈ సినిమాకి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించారు. 2003లో విడుదలైన ‘ఠాగూర్‌’ బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టి చిరు కెరీర్‌లోనే ఓ సూపర్‌హిట్‌గా నిలిచింది. అయితే, ఒకవేళ ‘ఠాగూర్‌’ చిత్రాన్ని రీమేక్‌ చేయాల్సి వస్తే అందులో హీరోగా తన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ అయితే సరిగ్గా సరిపోతారని చిరు అభిప్రాయపడ్డారు.

‘ఠాగూర్‌’ ఒక్కటే కాకుండా తన కెరీర్‌లో సూపర్‌హిట్ చిత్రాలుగా చెప్పుకునే ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, ‘ఛాలెంజ్‌’, ‘రౌడీ అల్లుడు’, ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘ఇంద్ర’ సినిమాలకు ఇప్పటితరం హీరోల్లో ఎవరు సూట్‌ అవుతారో చిరు తెలియజేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం.. ‘ఇంద్ర’కి ప్రభాస్‌, ‘ఛాలెంజ్‌’కి అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ, ‘రౌడీ అల్లుడు’కి బన్నీ, రవితేజ, ‘గ్యాంగ్‌ లీడర్‌’కి చరణ్‌, తారక్‌, ‘జగదేకవీరుడు..’కి మహేశ్‌బాబు, చెర్రీ, తారక్‌, ‘విజేత’ చిత్రానికి నాగచైతన్య చక్కగా నప్పుతారని వివరించారు. అంతేకాకుండా తన ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ ‘స్వయంకృషి’ని రీమేక్‌ చేస్తే తాను మాత్రమే సెట్‌ అవుతానని ‘సామ్‌జామ్‌’ కార్యక్రమంలో చిరు పేర్కొన్నారు.

ఇదీ చదవండి

సురేఖ నో అంటుందేమో అనుకున్నా: చిరంజీవిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని