చిరు కొత్త లుక్‌: తెరవెనుక కథ ఇదీ! - Chiru Urban Monk look behind scenes
close
Updated : 15/09/2020 11:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు కొత్త లుక్‌: తెరవెనుక కథ ఇదీ!

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి ఇటీవల కొత్త లుక్‌తో తన అభిమానులను ఆశ్చర్యపర్చారు. దీనిలోనున్నటి గుండు, నల్లటి కళ్లద్దాలతో చిరు ‘అర్బన్‌ మాంక్‌’ స్టైల్‌లో కనిపించారు. ఈ లుక్‌ను అభిమానులు లైక్‌లతో ముంచెత్తారు. అంతేకాకుండా చిరు నిజంగా గుండు చేయించుకున్నారా.. యాప్‌ సహాయంతో అలా కనిపించారా.. లేదా ఫొటో ఎడిటింగ్‌‌ మహిమా? అనే సందేహాలతో తలమునకలయ్యారు. అయితే వీరి ప్రశ్నలన్నిటికీ చిరు ఈ రోజు సమాధానమిచ్చారు.

‘‘మేకింగ్‌ ఆఫ్ అర్బన్‌ మాంక్‌’’ అంటూ తన కొత్త లుక్‌ ఎలా సాధ్యమయిందీ వీడియో ద్వారా తెలియచేశారు. దీనితో సందేహం తీరిన నెటిజన్లు ఇదా సంగతి అని ఆశ్చర్యపోతున్నారు. చిరు ప్రస్తుతం శివ కొరటాల సారథ్యంలో వస్తున్న  ‘ఆచార్య’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొవిడ్‌ పరిస్థితులు చక్కబడిన వెంటనే తిరిగి షూటింగ్‌ ప్రారంభించేందుకు ఈ చిత్ర బృందం సిద్ధంగా ఉంది. మరోవైపు మెగాస్టార్‌ ‘లూసిఫర్‌’, ‘వేదాళం’ రీమేక్‌లలో నటించనున్నారు. కాగా, తమ అభిమాన నటుడు అర్బన్‌ మాంక్‌ గెటప్‌లో వీటిలో ఏదైనా చిత్రంలో కనిపించవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని