అమ్మ కోసం చిరు ‘సండే స్పెషల్‌’  - Chiru cooks Sunday Special for Mom
close
Published : 10/08/2020 13:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మ కోసం చిరు ‘సండే స్పెషల్‌’ 

మెగా స్టార్‌ స్వయంగా ఏం చేశారంటే...

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెగా స్టార్‌ చిరంజీవి న్యూలుక్‌తో సామాజిక మాధ్యమాల్లో అదరగొడుతున్నారు. నటన పట్ల ఎంత అంకిత భావంతో ఉంటారో.. తన కుటుంబం, అనుబంధాలకు కూడా అంతే ప్రాముఖ్యం ఇవ్వటం చిరు స్టైల్‌. కాగా, ఆదివారం కాస్త బోర్‌గా ఫీలైన చిరుకు వంట చేయాలనే ఆలోచన వచ్చింది. కాగా, గతంలో కూడా దోసెలు వంటి అనేక వంటకాలను తయారుచేసి తన తల్లికి రుచి చూపించిన ఈయన.. ఈ సారి సండే స్పెషల్‌గా చేసిన వంటకం మరీ ప్రత్యేకం. తన చిన్నతనంలో అమ్మ తనకు తినిపించిన అనేక రుచుల్లో ఒకదానిని ఎంపిక చేసుకున్నారు. ఇంతకీ చిరంజీవి ఏం చేశారంటే..

గోదావరి జిల్లాలో దొరికే కట్టె పరిగె అనే చిన్న సైజు చేప వంటకం. మరి దీనిని చింతతొక్కుతో కలిపి స్వయంగా ఫ్రై చేసిన చిరు.. తన తల్లికి దగ్గరుండి మరీ వడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియోను, తన అభిమానులతో పంచుకున్నారు.  అంతేకాదు.. ‘వంట ఎలా ఉందంటూ’.. తల్లిని అడగటం దీనిలో చూడచ్చు. ఇంతకీ చిరు వంటను అంజన హిట్‌ చేశారా, ఫ్లాప్‌ చేశారా తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని