బాస్‌.. గుండూ బాస్‌..మన హీరోలను ఇలా చూశారా? - Cinema actors Remove hair for Movie and special occasions
close
Updated : 11/09/2020 15:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాస్‌.. గుండూ బాస్‌..మన హీరోలను ఇలా చూశారా?

చిత్ర పరిశ్రమలో నటుడిగా రాణించాలంటే ఎంతో కష్టపడాలి. చేసే ప్రతి పాత్రపైనా మనసు పెట్టాలి. ఆ పాత్రను ఆకళింపు చేసుకోవాలి. అందుకోసం అవసరమైతే ఆహారం తగ్గించాలి.. ఆహార్యాన్ని మార్చుకోవాలి. ఇలా సినిమా కోసం, అందులోని పాత్ర కోసం కండలు పెంచేవాళ్లు కొందరైతే, అవసరమైతే గుండు చేయించుకునేవాళ్లు ఇంకొందరు. సినిమాలోనే కాదు.. పాత్ర కోసం కాకపోయినా, ప్రత్యేక సందర్భాల్లో, తిరుమల వంటి పుణ్య క్షేత్రాలను దర్శించుకున్న సందర్భాల్లో తలనీలాలు సమర్పించిన వారు ఇంకొందరు. తాజాగా అగ్ర కథానాయకుడు చిరంజీవి గుండుతో ఉన్న ఫొటోను సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేయడంతో ఒక్కసారిగా వైరల్‌ అయింది. తన కొత్త సినిమా కోసం ఇలా కనిపించారా? లేక ఏదైనా టెక్నిక్కా అన్న విషయం తెలియకపోయినా అభిమానులను మాత్రం ఆకట్టుకుంటోంది. ఇలా చిత్ర పరిశ్రమలోని పలువురు కథానాయకులు సినిమా కోసం, ప్రత్యేక సందర్భాల్లో గుండుతో కనిపించి అలరించారు. అలా ఆకట్టుకునే నటులెవరో చూసేద్దామా!

చిరంజీవి అందుకోసమేనా?

గురువారం చిరు షేర్‌ చేసిన ఫొటో టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. గుండు చేయించుకుని, నల్లటి కద్దాలతో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకుంటూ ‘నేను సాధువులా ఉన్నానా’ అంటూ అర్బన్‌మాంక్‌ హ్యాష్‌ ట్యాగ్‌ జోడించారు. చిరు ప్రస్తుతం ‘ఆచార్య’లో నటిస్తున్నారు. కరోనా కారణంగా తాత్కాలికంగా ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడింది. దీని తర్వాత ఆయన ‘లూసిఫర్‌’, ‘వేదాళం’ రీమేక్‌ చిత్రాల్లో నటించే అవకాశం ఉంది. ‘వేదాళం’లో అజిత్‌ చిన్న జుట్టుతో కనిపిస్తారు. చిరు ఆ సినిమా ఫొటో షూట్‌ కోసమే ఇలా మారారని టాలీవుడ్‌ టాక్‌.

శివాజీ కోసం రజనీకాంత్‌

స్టైల్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ రజనీకాంత్‌. వెండితెరపై ఆయన అలా నడిచొస్తే చాలు నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తుంది. శంకర్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన ‘శివాజీ’ చిత్రం కోసం రజనీ గుండుతో కనిపించారు.

‘అభయ్‌’గా భయపెట్టిన కమల్‌హాసన్‌

‘లోక నాయకుడు’గా చిత్ర పరిశ్రమలో పేరు తెచ్చుకున్న స్టార్‌ నటుడు కమల్‌హాసన్‌. వెండితెరపై ఆయన చేయని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు కూడా ‘భారతీయుడు2’ కోసం ఆయన కష్టపడుతున్నారు. సురేశ్‌ కృష్ణ దర్శకత్వంలో కమల్‌ నటించిన ‘అభయ్‌’లో ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో ఒక పాత్ర కండలు తిరిగి, గుండుతో కనిపిస్తుంది. కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేకపోయిన ఈ సినిమా స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.

సాధువుగా మారిన మోహన్‌బాబు

మోహన్‌బాబు కీలక పాత్రలో కాపుగంటి రాజేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శివ శంకర్‌’. ఇందులో మోహన్‌బాబు బౌద్ధ సాధువుగా కనిపించి అలరించారు. ఈ పాత్ర కోసం ఆయన తల వెంట్రుకల తీసేశారు. మోహన్‌బాబు సరసన సౌందర్య కీలక పాత్ర పోషించారు.

‘గజని’గా సూర్య

మురగదాస్‌-సూర్య కాంబినేషన్‌లో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘గజని’ ఈ సినిమాలో మతిమరుపు మనిషిగా సూర్య గుండుతో కనిపిస్తారు. తన ప్రియురాలిని చంపిన వ్యక్తులపై ఒక మతిమరుపు వ్యక్తి ఎలా పగ తీర్చుకున్నాడన్నది ఈ చిత్ర కథ. మ్యూజికల్‌గానూ ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇదే పాత్రను హిందీలో ఆమీర్‌ఖాన్‌ పోషించారు. ఆయన కూడా ‘గజని’ పాత్ర కోసం తల వెంట్రుకలు తీసేశారు.

అన్న బాటలోనే తమ్ముడు

న్న సూర్య ‘గజని’గా కనిపిస్తే, ఆయన తమ్ముడు కార్తి ‘కాష్మోరా’లో రాజ్‌ నాయక్‌ పాత్ర కోసం గుండు చేయించుకున్నారు. గోకుల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి టాక్‌నే తెచ్చుకుంది.

ఆ సినిమా కోసం రాజశేఖర్‌

‘యాంగ్రీ యంగ్‌మెన్‌’గా వరుస చిత్రాలతో అలరించిన నటుడు రాజశేఖర్‌. తమిళంలో బాలా దర్శకత్వంలో విక్రమ్‌ నటించిన చిత్రం ‘సేతు’. ఆ చిత్రాన్ని తెలుగులో ‘శేషు’ పేరుతో జీవితా రాజశేఖర్‌ తెరకెక్కించారు. మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తిగా రాజశేఖర్‌ నటన ఆకట్టుకుంది. ఈ పాత్ర కోసం తొలిసారి రాజశేఖర్‌ గుండు చేయించుకున్నారు. అయితే బాక్సాఫీస్‌ వద్ద మాత్రం ఈ చిత్రం విజయాన్ని అందుకోలేకపోయింది.

తేజపై నమ్మకంతో..

హేశ్‌బాబు కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిజం’. 2003లో వచ్చిన ఈ చిత్రం నటన పరంగా మహేశ్‌కు కెరీర్‌లో మైలురాయిలా నిలిచింది. తొలి చిత్రం ‘తొలి వలపు’ పరాజయంతో ప్రతినాయకుడిగా అవతారం ఎత్తిన గోపీచంద్‌ ఇందులో దేవుడు అలియాస్‌ దేవయ్య శర్మ పాత్ర పోషించారు. ఇందుకోసం ఆయన గుండు చేయించుకున్నారు. గోపీచంద్‌ కెరీర్‌ను ఈ సినిమా మరో మెట్టు ఎక్కించింది.

బాలకృష్ణ కూడా అలా కనిపించనున్నారా?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల చేసిన ‘BB3 Roar’ సినిమాపై అంచనాలను పెంచింది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందులో ఒకటి అఘోరగా కనిపించనున్నారు. కొంతకాలం కిందట బాలకృష్ణ ఓ కార్యక్రమానికి ఇలా గుండుతో హాజరయ్యారు. దీంతో ఆ గెటప్‌ అఘోర కోసమేనని టాక్‌ మొదలైంది. దీనిపై స్పష్టత రావాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

ఇలా కొందరు సినీ నటులు తమ పాత్రల కోసం తల వెంట్రుకలు తీసేస్తే, మరికొందరు ప్రొథ్సటిక్‌ మేకప్‌తోనూ గుండుతో అలరించారు. నాగార్జున, సిద్ధార్థ్‌లతో పాటు దివంగత నటులు శ్రీహరి, ఉదయ కిరణ్‌ తదితరులు పుణ్య క్షేత్రాలకు వెళ్లి తలనీలాలు సమర్పించిన ఫొటోలు అప్పట్లో వైరల్‌ అయ్యాయి.

-ఇంటర్నెట్‌డెస్క్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని