సన్నీ ఆట.. శిల్ప యోగా.. బన్ని నామినేట్‌ - Cinema stars social media posts
close
Published : 28/07/2020 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సన్నీ ఆట.. శిల్ప యోగా.. బన్ని నామినేట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు సమయమే తెలియదు. ఇక ప్రతి విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా మన స్నేహితులతో పంచుకుంటాం. బోలెడన్ని లైక్‌లు, కామెంట్లు. అదే సినిమా తారలైతే ఇక చెప్పేది ఏముంది? తాజాగా మన సినీ తారలు ఎన్నో విషయాలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు.

ఫిట్‌నెస్‌ విషయంలో అందాల తార శిల్పాశెట్టి ఎంతో జాగ్రత్త వహిస్తారు. తాజాగా వ్యాయామం చేస్తున్న వీడియోను పంచుకున్నారు. కరోనా కారణంగా ప్రయాణాలు చేయలేకపోతున్నా, వర్కవుట్‌లు మాత్రం మానడం లేదన్నారు.

ఇక గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అల్లు అర్జున్‌ సతీమణి అల్లు స్నేహారెడ్డి తన చిన్నారులతో కలిసి మొక్కలు నాటారు. అల్లు అర్జున్‌ను నామినేట్‌ చేశారు. నటుడు రాజీవ్‌ కనకాల కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. నితిన్‌-శాలిని కలిసి ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకుంటూ కథానాయిక కీర్తి సురేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు. యువ నటుడు కార్తికేయ నితిన్‌తో దిగిన ఫొటోను పంచుకోగా, హైదరాబాదీ పోరడు రాహుల్‌ సిప్లిగంజ్‌ చార్మినార్‌ దగ్గర ఫొటో దిగి షేర్‌ చేశారు. సాయికుమార్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘శ్రీకారం’ చిత్రంలోని ఆయన లుక్‌ను పంచుకున్నారు.

ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కేజీఎఫ్‌2’ ఒకటి ఇందులో అధీర పాత్రను ఈనెల 29న విడుదల చేయనున్నారు. లాక్‌డౌన్‌ ఉన్నా యోగా చేస్తూ సమయాన్ని ఆస్వాదిస్తున్నట్లు కథానాయిక శద్ధాదాస్‌ తెలిపింది. ఇక మరో కథానాయిక అదా శర్మ కొత్త సినిమా ఒప్పుకొన్నారు.దర్శకుడు వంశీ పైడిపల్లి పుట్టిన రోజు సందర్భంగా మహేశ్‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. సన్నీ తన పెర్ఫామెన్స్‌తో ఉర్రూతలూగించగా, సమీరారెడ్డి విచిత్ర వేషాలతో అలరించారు. ఇలా మన సినీ తారలు పంచుకున్న కొన్ని ఆసక్తికర పోస్టులు మీకోసం..Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని