నౌకాయాన శాఖ పేరు మార్పు - Clarity In Name Clarity In Work says modi
close
Published : 09/11/2020 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నౌకాయాన శాఖ పేరు మార్పు

అహ్మదాబాద్‌: నౌకాయాన శాఖ పేరును మార్చుతున్నట్లు ప్రధాని ప్రకటించారు. దీనిని మినిస్టరీ ఆప్‌ పోర్ట్స్‌, షిప్పింగ్‌ అండ్‌ వాటర్‌వేస్‌గా మార్పు చేస్తున్నట్లు వెల్లడించారు. సూరత్‌లోని హజారియా-భావ్‌నగర్‌లోని ఘోఘా మధ్య రోపెక్స్‌ జలమార్గ సేవలను ఆదివారం ఆయన ప్రారంభించారు. దీనివల్ల ఈ రెండు ప్రాంతాల మధ్య దాదాపు 370 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. జలమార్గం ద్వారా అయితే ఈ రెండింటికీ కేవలం 90 కిలోమీటర్లు మాత్రమే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. దేశంలోని సముద్రతీర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

 ‘‘అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందువల్లే సముద్రతీర ప్రాంతాలు అత్మనిర్భర్‌ భారత్‌లో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. దీనికి మరింత ఊతమిచ్చేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది’’ అని మోదీ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసే చర్యల్లో భాగంగా నౌకాయాన శాఖను విస్తరిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.కొత్తగా పోర్టులు, జలమార్గాలను కూడా దీని పరిధిలోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.ఈ రెండింటికి సంబంధించిన చాలా పనిని నౌకాయాన మంత్రిత్వ శాఖే నిర్వహిస్తోందని చెప్పారు. పేరులో స్పష్టత ఉంటే.. చేసే పనిలోనూ స్పష్టత ఉంటుందనే ఉద్దేశంతోనే శాఖ పేరును మారుస్తున్నట్లు మోదీ వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని