‘కేసులు పెరిగితే కళాశాలలు మూసేస్తాం’ - Colleges may be shut if coronavirus cases rise says Karnataka Health Minister Dr K Sudhakar
close
Published : 23/11/2020 00:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కేసులు పెరిగితే కళాశాలలు మూసేస్తాం’

కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి 

బెంగళూరు: కరోనా కేసులు పెరిగితే కళాశాలల్ని మూసివేస్తామని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు ఎనిమిది నెలలు మూతపడ్డ కళాశాలలు నవంబరు 17న పునఃప్రారంభమయ్యాయి. గత ఆరు రోజులుగా విద్యార్థులు నిబంధనలు పాటిస్తూ, జాగ్రత్తల నడుమ తరగతులకు హాజరౌతున్నారు.  ఈ క్రమంలో దాదాపు 130 మంది విద్యార్థులు కొవిడ్‌-19 బారినపడ్డారని సమాచారం అందింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల గురించి ప్రశ్నించగా మంత్రి కె.సుధాకర్‌ ప్రతిస్పందించారు. ‘మీరు చెప్పినట్లు ఇలానే కేసులు పెరుగుతూపోతే.. మరోసారి కళాశాలల్ని మూసివేస్తాం. దీనికి ప్రత్యామ్నాయం లేదు’ అని పేర్కొన్నారు.

పాఠశాలల పునః ప్రారంభంపై సోమవారం కర్ణాటక ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించింది. కరోనా వైరస్‌ వల్ల ఇప్పట్లో పాఠశాలలు తెరిచే మార్గం లేదని ఇదే సందర్భంగా మంత్రి కె.సుధాకర్‌ చెప్పారు. దాదాపు 130 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని, ఉన్నతాధికారుల నుంచి సమాచారం సేకరిస్తానని అన్నారు.

అనంతరం ఇటువంటి పరిస్థితుల్లో కళాశాలల్ని ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించగా.. ‘విద్యార్థులకు కొవిడ్‌-19 సోకదని నేను చెప్పడం లేదు. యువతకు రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. విద్యార్థుల్ని కాపాడుకుంటూ.. వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని భావించాం. ఆ బాధ్యతతోనే విడతల వారీగా కళాశాలల్ని, పాఠశాలల్ని తెరవాలని నిర్ణయించుకున్నాం’ అని మంత్రి కె.సుధాకర్‌ పేర్కొన్నారు.
ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా విద్యార్థులు పాఠాల్ని పూర్తిస్థాయిలో వినలేకపోతున్నారని విద్యాశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. గాడ్జెట్లు, సరైన నెట్‌ లేకపోవడంతోపాటు అనారోగ్యం, కంటి సమస్యల వల్ల ఇబ్బందులు ఎదురౌతున్నాయని వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని