వరుణ్‌ ధావన్‌కు ఇష్టం లేదా?  - Coolie No. 1 OTT Release - Varun Dhawan And David Dhawan Not On The Same Page
close
Published : 08/10/2020 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరుణ్‌ ధావన్‌కు ఇష్టం లేదా? 

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుణ్‌ ధావన్‌, సారా అలీఖాన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం కూలీ నెం-1. డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వం వహించారు. వాసు భగ్నానీ సహ నిర్మాత. ఈ చిత్రం ఓటీటీ వేదిక అయిన అమెజాన్‌ ప్రైమ్‌ లో దీపావళి సందర్భంగా విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాను డిజిటల్‌ మాధ్యమంలో విడుదల చేయడం చిత్ర బృందంలోని పలువురికి ఇష్టం లేదని సమాచారం. వాసు భగ్నానీ, డేవిడ్‌ ధావన్‌ సినిమాను డిజిటల్‌ మాధ్యమంలో విడుదల చేస్తే ప్రయోజకరంగా ఉంటుందని అనుకుంటున్నారు. కానీ, వరుణ్‌ ధావన్‌కు ఇష్టం లేదని బాలీవుడ్‌ మీడియా అంటోంది. 1995లో విడుదల అయిన కూలీ నెం-1 చిత్రాన్ని ప్రస్తుతం అదే పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రం వేసవి సందర్భంగా మేలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, థియేటర్‌లు తెరుచుకోకపోవడంతో దీపావళికి వాయిదా వేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని