8లక్షల దిగువకు క్రియాశీల కేసులు - Corona Cases in india Crossed 74 lakhs mark
close
Updated : 17/10/2020 09:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

8లక్షల దిగువకు క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 74 లక్షలు దాటేసింది. అయితే గతంతో పోల్చుకుంటే కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. శుక్రవారం 9,99,090 నమూనాలను పరీక్షించగా 62,212 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 74,32,681గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 837 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,12,998కి చేరింది. నిన్న దేశ వ్యాప్తంగా 70,816 మంది డిశ్ఛార్జి కాగా.. ఇప్పటి వరకూ 65,24,596 మంది కోలుకున్నట్లు  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 7,95,087 క్రియాశీల కేసులు ఉన్నట్లు పేర్కొంది. 

గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మరోవైపు రికవరీ రేటు పెరుగుతోంది. దాదాపు 87.78 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో కేవలం 10.70 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు 1.52 శాతానికి తగ్గిందని బులిటెన్‌లో పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 9,32,54,017 నమూనాలను పరీక్షించినట్లు కేంద్రం వెల్లడించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని