భారత్‌లో 70వేలు దాటిన కరోనా మరణాలు! - Corona Deaths Crossed 70K in India
close
Updated : 05/09/2020 22:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో 70వేలు దాటిన కరోనా మరణాలు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో కరోనా వైరస్‌ మరింత ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు, మరణాలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 86వేల కేసులు, 1,089 మరణాలు నమోదయ్యాయి. కేంద్ర గణాంకాల ప్రకారం.. ఈ రోజు ఉదయం 8గంటల వరకు దాదాపు 4.77 కోట్లకుపైగా శాంపుల్స్‌ పరీక్షించగా.. 40.23 లక్షల కేసులు, 69,561 మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న పలు రాష్ట్రాలు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్న కొత్త గణాంకాలను కలిపితే దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 70 వేలు దాటేసింది. కరోనాతో ఈరోజు మహారాష్ట్రలో 312 మంది ప్రాణాలు కోల్పోగా.. కర్ణాటకలో 128మంది, ఏపీలో 71, తమిళనాడులో 61, పశ్చిమబెంగాల్‌లో 58, దిల్లీలో 25 మంది చొప్పున మృత్యువాతపడ్డారు.

భారత్‌లో నమోదవుతున్న మరణాల్లో దాదాపు 70శాతం మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, దిల్లీ, ఏపీలలోనే ఉండగా.. మిగతా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 30.12శాతంగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు పేర్కొంటున్నాయి. అలాగే, క్రియాశీల కేసులు కూడా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, యూపీ, తమిళనాడులోనే దాదాపు 62శాతం ఉండగా.. మిగతా చోట్ల 38 శాతంగా ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 77శాతానికి పైగా ఉండగా.. మరణాల రేటు 1.7శాతంగా ఉంది.

మహారాష్ట్రలో 20వేలకు పైగా కేసులు

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి శరవేగంగా కొనసాగుతోంది. శనివారం రికార్డు స్థాయిలో 20,489 కొత్త కేసులు రాగా.. 312 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనాబారిన పడినవారి సంఖ్య 8,83,862కి పెరగ్గా.. మృతుల సంఖ్య 26,276కి చేరింది. కరోనా నుంచి కోలుకొని ఇప్పటివరకు 6,36,574 మంది డిశ్చార్జి కావడంతో రాష్ట్రంలో ప్రస్తుతం 2,20,661 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

దిల్లీలో ఆగని ఉద్ధృతి

దిల్లీలో శనివారం దాదాపు 40వేల నమూనాలను పరీక్షించగా.. 2,973 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 25 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,538కి పెరిగింది. ఇప్పటిదాకా దిల్లీలో మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 1,88,193కి చేరగా.. 4,538 మంది ప్రాణాలు కోల్పోయారు. దిల్లీలో గడిచిన 24గంటల్లో 1920 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 1,63,758కి పెరిగింది. ప్రస్తుతం 19,870 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

కర్ణాటకలో 128 కొత్త మరణాలు

కర్ణాటకలో శనివారం కొత్తగా 9,746 కేసులు, 128 మరణాలు నమోదయ్యాయి. 9,102 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ బాధితుల సంఖ్య 3,89,232కి పెరగ్గా.. మరణాల సంఖ్య 6,298గా ఉంది. కొవిడ్‌ సోకినవారిలో 2,83,298 మంది కోలుకొని డిశ్చార్జి కావడంతో ప్రస్తుతం 99,617 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తమిళనాట 5,870 కొత్త కేసులు
తమిళనాడులో 5,870 కొత్త కేసులు, 61 మరణాలు నమోదయ్యాయి. 5,859 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కొవిడ్‌ బాధితుల సంఖ్య 4,57,697కి చేరగా.. మృతుల సంఖ్య 7,748గా ఉంది. తాజాగా మరో 5,859 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 3,98,366కి పెరిగింది. గడిచిన 24గంటల్లోనే 79,840 శాంపిల్స్‌ పరీక్షించారు. మొత్తంగా 50,42,197 నమూనాలను పరీక్షించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని