దరఖాస్తుల స్వీకరణకు డబ్బాల ఏర్పాటు - Corona Effect Apples in Boxes Officials Not Taking Directly in Adilabad Dist
close
Published : 17/07/2020 23:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దరఖాస్తుల స్వీకరణకు డబ్బాల ఏర్పాటు

అప్రమత్తమయిన ఆదిలాబాద్‌ రెవెన్యూ యంత్రాంగం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమయ్యింది. కరోనా నివారణకు అధికారులు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా భౌతికంగా కలవకుండా ఏర్పాట్లు చేశారు. దరఖాస్తులను నేరుగా తీసుకోకుండా కార్యాలయంలో డబ్బాలు ఏర్పాటు చేసి అందులో వేయాలని దరఖాస్తుదారులను కోరుతున్నారు. అత్యవసరం ఉంటేనే కార్యాలయానికి రావాలని సూచిస్తున్నారు. మరిన్ని సేవలు ఆన్‌లైన్‌ ద్వారా అందించాలని నిర్ణయించారు. పట్టాదారు పుస్తకాల్లో మార్పులు చేసుకోవాలంటే మెయిల్‌ చేయాల్సిందిగా కార్యాలయంలో నోటీసులు అంటించారు. కాగా పలువులు దరఖాస్తుదారులు ఈ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేరుగా కలిసినప్పుడే సకాలంలో జరగని పనులు ఇలా చేస్తే ఎప్పుడు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. జనన, మరణ ధ్రువీకరణ లాంటి అత్యవసర పత్రాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. 
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని