థియేటర్లలోనే ‘కరోనా వైరస్‌’ - Corona Virus will be 1st film to release after LOCKDOWN is lifted on movie theatres RGV
close
Updated : 02/10/2020 11:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

థియేటర్లలోనే ‘కరోనా వైరస్‌’

లాక్‌డౌన్‌ తర్వాత మొదటిసారి ప్రారంభంకానున్న థియేటర్లు..!

హైదరాబాద్‌: అన్‌లాక్‌-5 మార్గదర్శకాల్లో భాగంగా అక్టోబర్‌ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను ప్రారంభించడానికి కేంద్రం అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో థియేటర్లు ప్రారంభం కాగానే మొదటి చిత్రంగా తాను నిర్మించిన ‘కరోనా వైరస్‌’ విడుదల చేయనున్నట్లు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా ‘కరోనా వైరస్‌’ గురించి ట్వీట్లు పెట్టారు.

‘ఎట్టకేలకు అక్టోబర్‌ 15వ తేదీ నుంచి సినిమా థియేటర్లు ఓపెన్‌ అవుతున్నాయి. సంతోషంగా ఉంది. లాక్‌డౌన్‌ తర్వాత విడుదల చేయనున్న మొదటి చిత్రంగా ‘కరోనా వైరస్‌’. లాక్‌డౌన్‌ సమయంలో ఒక కుటుంబం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది అనేది చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. లాక్‌డౌన్‌లోనే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేశాం’ అని ఆర్జీవీ పేర్కొన్నారు. శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి అగస్త్య మంజూ దర్శకత్వం వహించారు. కంపెనీ క్రియేషన్స్‌ పతాకంపై రామ్‌గోపాల్‌ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని