హోటళ్లపై కరోనా నీడ - Corona shadow over hotels
close
Published : 12/11/2020 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హోటళ్లపై కరోనా నీడ

9 నెలల్లో 53% తగ్గిన అద్దె ఆదాయం
జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక

దిల్లీ: హోటల్‌ రంగంపై కొవిడ్‌ ప్రభావం అధికంగా ఉంది. జనవరి-సెప్టెంబరులో సగటున ఒక్కో గదిపై వచ్చే అద్దె ఆదాయం 2019 ఇదే సమయంతో పోలిస్తే 53 శాతం క్షీణించిందని ప్రోపర్టీ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది. జేఎల్‌ఎల్‌ నివేదిక ప్రకారం.. భారత్‌లోని అన్ని కీలక 11 మార్కెట్లలో జులై-సెప్టెంబరులో ఒక్కో గదిపై వచ్చే సగటు ఆదాయ గణాంకాలు డీలా పడ్డాయి. బెంగళూరులో ఈ ఆదాయాలు క్రితం ఏడాది క్రితంతో పోలిస్తే ఏకంగా 88.1 శాతం మేర తగ్గాయి. ‘వ్యాపారాలు, పర్యటనలకు అనువుగా ఉండే ప్రాంతాల్లో హోటల్‌ పరిశ్రమకున్న అవకాశాలపై పెట్టుబడుదార్లు ఇపుడిపుడే దృష్టి సారిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ అన్‌లాక్‌ అవుతుండడంతో గిరాకీ క్రమంగా పెరుగుతుందని..ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో వారాంతాల్లో గదుల భర్తీ పుంజుకుంటుంద’ని జేఎల్‌ఎల్‌ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. ముంబయిలో ఒక్కో గదికి వచ్చే ఆదాయాలు గతంతో పోలిస్తే 71.7 శాతం తగ్గినా.. సగటు ఆదాయాల్లో అగ్రస్థానంలోనే ఉంది. పుణె(86.2%), కోల్‌కతా(82.6%), గోవా(78.8%)లలో కూడా ఆదాయాలు బాగా తగ్గాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని