కరోనా టీకా వచ్చినా.. ఆ నిబంధన కొనసాగుతుంది - Corona vaccine for 30 crore in India by July 2021
close
Published : 29/11/2020 11:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా టీకా వచ్చినా.. ఆ నిబంధన కొనసాగుతుంది

వచ్చే జులై కల్లా 30 కోట్ల మందికి కరోనా టీకా: ఐసీఎంఆర్‌

దిల్లీ: వచ్చే ఏడాది జులై కల్లా 30 కోట్ల మంది ప్రజలకు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ద్వారా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ప్రొఫెసర్‌ బలరాం భార్గవ లఖ్‌నవూలోని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీ నిర్వహించిన ఓ ఆన్‌లైన్‌ సెమినార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన .. దేశంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌కి సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు. కరోనా టీకా అందుబాటులోకి వచ్చినా.. మాస్క్‌ ధరించటం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.

మాస్క్‌ అనేది వస్త్రరూపంలోని వ్యాక్సిన్‌

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ దిశగా భారత్‌ వడివడిగా అడుగులు వేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా 19 సంస్థలకు చెందిన 24 తయారీ యూనిట్లు కొవిడ్‌ 19 వ్యాక్సిన్‌ తయారీలో భాగం కానున్నాయని వెల్లడించారు. ఐతే కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ మాత్రమే సరిపోదని.. నిపుణులు సూచించిన నిబంధనలు పాటించటం తప్పనిసరన్నారు. ఇందుకుగాను మహమ్మారి వ్యాప్తి నిరోధానికి ప్రస్తుతం అమలులో ఉన్న ఆరోగ్య నిబంధనలు కొనసాగుతాయని ఆయన అన్నారు. టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ.. మాస్క్‌ నిబంధన యధాతధంగా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. మాస్క్‌ అనేది వస్త్రరూపంలో ఉన్న వ్యాక్సిన్‌ అని పేర్కొన్నారు.

ప్రస్తుతం స్థానికంగా అభివృద్ధి చేస్తున్న రెండింటితో సహా.. భారత్‌లో మొత్తం ఐదు సంస్థల కరోనా వ్యాక్సిన్‌ తయారీ ప్రయోగాలు కొనసాగుతున్నాయని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడించారు. భారత్‌ కేవలం తనకోసం మాత్రమే కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 60 శాతానికి కూడా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తోందని తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని