కరోనా సోకిన దంపతుల ఆత్మహత్య - Couples suicide due to COVID
close
Published : 13/11/2020 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా సోకిన దంపతుల ఆత్మహత్య

జగిత్యాలలో ఘటన

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరోనా బారిన పడిన దంపతులు ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణం చెందడం కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజి రాంబాబు (45), లావణ్య (40) దంపతులు జగిత్యాలలోని శివవీధిలో నివసిస్తున్నారు. మూడు రోజుల క్రితం రాంబాబుకు కరోనా పాజిటివ్‌ అని తెలిసింది. ఈ క్రమంలో అతని భార్య లావణ్య సైతం పరీక్షలు చేయించుకోగా.. గురువారం ఉదయం ఆమెకు కూడా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ క్రమంలో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్న దంపతులు ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో వారి ఇంట్లో అద్దెకు ఉంటున్నవారు అనుమానం వచ్చి తలుపులు తట్టినా స్పందన లేకపోవడంతో.. కిటికీల్లోంచి లోపలకు చూశారు.  ఇంటిలో వారిద్దరూ ఉరి వేసుకున్నట్లు కనిపించడంతో ఇరుగుపొరుగు వారిని పిలిచి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొవిడ్‌ నిబంధనల మేరకు మృతదేహాలను ఆస్పత్రికి తరలించే విషయమై మున్సిపల్‌ కమిషనర్‌కు లేఖ రాశారు.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని