కొవిడ్‌-19 క్లెయింలు పెరిగాయి - Covid‌-19 claims increased
close
Published : 21/10/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌-19 క్లెయింలు పెరిగాయి

దిల్లీ: ఆరోగ్య బీమా పాలసీల క్లెయింలలో కొవిడ్‌-19కు సంబంధించినవి దాదాపు 40 శాతం పెరిగాయని బీమా అగ్రిగేటర్‌ పాలసీబజార్‌.కాం నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. ఇందులో ఎక్కువగా 60 ఏళ్లకు పైబడిన వారి నుంచి రాగా తర్వాత 41-45 ఏళ్ల మధ్యలో వారు ఎక్కువగా క్లెయిం చేసుకున్నారని నివేదికలో పేర్కొంది. సెప్టెంబరులో మొత్తం ఆరోగ్య బీమా క్లెయింలలో 40శాతం ఇవే ఉన్నాయని వెల్లడించింది. ఏప్రిల్‌- సెప్టెంబరు మధ్య కాలంలో చూస్తే దాదాపు 26శాతం వరకూ కరోనా చికిత్స క్లెయింలు ఉన్నట్లు తెలిపింది. కొవిడ్‌ చికిత్స కోసం సగటున రూ.1.18-2.19 లక్షల వరకూ బీమా సంస్థలు చెల్లించినట్లు వెల్లడించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని