విరుష్క.. అది మీ ప్రపంచాన్ని అందంగా చేస్తుంది   - Cricket Legend Sachin Tendulkar Wishes for Virat Kohli and Anushka Sharma for their good news
close
Published : 28/08/2020 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విరుష్క.. అది మీ ప్రపంచాన్ని అందంగా చేస్తుంది 

విరాట్‌ కోహ్లీ, అనుష్కశర్మకు సచిన్‌ శుభాకాంక్షలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అతడి సతీమణి అనుష్కశర్మ గురువారం ఉదయం తీపి కబురు చెప్పడంతో ప్రముఖుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. త్వరలోనే ఒక బుజ్జాయికి జన్మనివ్వబోతున్నామని ఇద్దరూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. దీంతో అటు అభిమానులతో పాటు ఇటు సెలబ్రిటీలు సైతం వారికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ నేపథ్యంలోనే క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ కాస్త ఆలస్యంగా స్పందించాడు. ఈ చిన్ని అద్భుతం త్వరలోనే వారి ప్రపంచాన్ని మరింత అందంగా, ఆనందదాయకంగా మారుస్తుందని ఆకాంక్షించాడు. ఇక టీమ్‌ఇండియా నుంచి హర్భజన్‌ సింగ్‌, కృనాల్‌ పాండ్య, హార్దిక్‌ పాండ్య, యజువేంద్ర చాహల్‌, కేఎల్‌ రాహుల్‌ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పారు. బీసీసీఐ, రాయల్‌ ఛాలెంజర్స్‌ కూడా ట్వీట్లు చేసి అభినందించాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని