కొత్త ఏడాదికి ‘ఢీజే’ గ్రాండ్‌ వెల్‌కమ్‌ - DJ PROMO
close
Updated : 06/07/2021 20:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త ఏడాదికి ‘ఢీజే’ గ్రాండ్‌ వెల్‌కమ్‌

హైదరాబాద్‌: కొత్త ఏడాది 2021కి నూతనోత్సాహంతో స్వాగతం పలకడానికి ఢీ, జబర్ధస్త్‌ బృందాలు కలిసి సిద్ధమైపోయాయి. తాజాగా ఇందుకు సంబంధించి విడుదలైన ‘ఢీజే’ నాల్గవ ప్రోమోలో నవ్వింది మల్లెచెండు.. పాటకు సుధీర్‌-రష్మీ, ఆకుచాటు పిందె తడిసె..పాటకు హైపర్‌ ఆది-వర్షిణి అదిరిపోయే స్టెప్పులతో అలరించారు. కార్యక్రమానికి అతిథులుగా  ‘చావు కబురు చల్లగా’ చిత్ర హీరో కార్తికేయ గుమ్మకొండ, సీనియర్‌ నటి ఆమని విచ్చేశారు. కార్తికేయ, ప్రదీప్‌ వేసిన పంచులు, రోజా నవ్వులు, జబర్దస్త్‌ ఆర్టిస్టుల స్కిట్లు, ఢీ డాన్సులు, రేవంత్‌-గీతా మాధురిల వినసొంపైన పాటలతో సరదాగా సాగనుంది ఈ కార్యక్రమం. మరి ఈ కొత్త ఏడాది ఢీజే వినోదాల జల్లులో తడవాలంటే మాత్రం డిసెంబరు 31 రాత్రి 9:30 గంటలదాకా వేచి చూడాల్సిందే. అప్పటిదాకా ఈ ప్రోమోను చూసేయండీ!  Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని