డీకే శివకుమార్‌కు కరోనా పాజిటివ్‌ - DK Shivakumar tests positive for coronavirus
close
Published : 25/08/2020 15:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డీకే శివకుమార్‌కు కరోనా పాజిటివ్‌

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ ‌విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కర్ణాటక కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు కొవిడ్‌ సోకింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. నిన్న, ఈరోజు ఆయన వరద ప్రభావిత జిల్లాలైన బెళగావి, బాగల్‌కోట్‌లలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో వాయిదా వేసుకుంటున్నట్టు ఆదివారం ట్వీట్‌ చేశారు. ఈ క్రమంలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఇటీవల కర్ణాటక సీఎం యడియూరప్ప, మాజీ సీఎం సిద్ధరామయ్య కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

మరోవైపు, కర్ణాటకలో నిన్న ఒక్కరోజే 5800 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,83,665కి పెరిగింది. వీరిలో 1,97,625 మంది కోలుకోగా.. 4810 మంది మరణించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 70శాతం కాగా.. మరణాల రేటు 1.7శాతంగా ఉంది. ప్రస్తుతం 81,230 (29శాతం) యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని