close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120069270 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1265847533550485504 [video_short_link] => 1265847533550485504 [created_by] => 8923881 [created_date] => 2020-05-28 11:24:38.890992 [modified_by] => [modified_date] => [display_status] => 1 [video_isdeleted] => ) [1] => stdClass Object ( [video_news_id] => 120069270 [video_srlno] => 2 [video_type] => 1 [video_link] => eABViudPBFE [video_short_link] => eABViudPBFE [created_by] => 8923881 [created_date] => 2020-05-28 11:24:38.960216 [modified_by] => [modified_date] => [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 28/05/2020 11:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చంద్రబోస్‌పై దేవిశ్రీ ప్రత్యేక గీతం..!

వీడియో షేర్‌ చేసిన రాక్‌స్టార్‌

హైదరాబాద్‌: ప్రముఖ సినీగేయ రచయిత చంద్రబోస్‌పై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ప్రత్యేకంగా ఓ గీతాన్ని ఆలపించారు. చంద్రబోస్‌ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలైన సందర్భంగా ఈ పాటను‌ రూపొందించి ఆయనకి అంకితమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను దేవిశ్రీ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘చంద్రబోస్‌ సర్‌.. మీ మీద ఉన్న ప్రేమాభిమానాలతో ఈ స్పెషల్‌ వీడియోను రూపొందించాను. సినీ గేయ రచయితగా మీరు ప్రయాణం ప్రారంభించి నేటికి 25 సంవత్సరాలైనందుకు అభినందనలు. అందరికీ ప్రేమను పంచే గొప్పవ్యక్తి మీరు. మీరు మరెన్నో  అద్భుతమైన పాటలతో మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను‌!!’ అని దేవిశ్రీ పేర్కొన్నారు. ఇటీవల ‘రంగస్థలం’ చిత్రం కోసం చంద్రబోస్‌ రాసిన.. ‘ఎంత సక్కగున్నావే’ పాటలోని లిరిక్స్‌ మార్చి దేవిశ్రీ ఈ వీడియోను రూపొందించారు.

1995లో విడుదలైన ‘తాజ్‌మహల్‌’ చిత్రంతో చంద్రబోస్‌ గేయ రచయితగా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. శ్రీకాంత్‌, మోనికాబేడీ జంటగా నటించిన ఈ సినిమాలోని ‘మంచుకొండల్లోని చంద్రమా’ పాటను రాసిందే ఆయనే. ఆ తర్వాత ఆయన ఎందరో అగ్ర, యువ హీరోల చిత్రాలకు మధురమైన పాటలు అందించారు. అలా ఆయన 1996లో విడుదలైన ‘పెళ్లిసందడి’ చిత్రానికిగాను ఉత్తమ గేయరచయితగా ‘నంది అవార్డు’ను మొదటిసారి అందుకున్నారు. ‘ఆది’ సినిమాలోని ‘నీ నవ్వుల తెల్లదనాన్ని’, ‘నేనున్నాను’ చిత్రంలోని ‘చీకటితో వెలుగే చెప్పెను’ పాటలకు కూడా ఆయన అవార్డును సొంతం చేసుకున్నారు. ఇటీవల ‘రంగస్థలం’ చిత్రంలో ఆయన రాసిన ‘ఎంతసక్కగున్నావే’ పాటకు ఫిలింఫేర్‌, సైమా అవార్డులు వరించాయి.




Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.