దావూద్‌ మా దేశ పౌరుడు కాదు..! - Dawood Ibrahim Dominican Govt
close
Published : 30/08/2020 14:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దావూద్‌ మా దేశ పౌరుడు కాదు..!

కామన్‌వెల్త్‌ ఆఫ్‌ డొమినికా వెల్లడి

దిల్లీ: అండర్‌ వరల్డ్‌ డాన్‌, మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దావూద్‌ ఇబ్రహీంకు తమ దేశపౌరసత్వం లేదని కామన్‌వెల్త్‌ ఆఫ్‌ డొమినికా స్పష్టం చేసింది. దావూద్‌ ఇబ్రహీంకు మా దేశ పాస్‌పోర్ట్‌ కూడా లేదని అధికారిక ప్రకటన చేసింది. దావూద్‌ డొమినికన్‌ పాస్‌పోర్టు కలిగివున్నాడని వస్తోన్న వార్తలను ఆ దేశం ఖండించింది. అతనికి తమ దేశ పౌరసత్వం లేదని, అంతేకాకుండా పెట్టుబడుల కార్యక్రమాల పేరుతో కూడా దావూద్‌కు ఎలాంటి పౌరసత్వం ఇవ్వలేదని స్పష్టం చేసింది. పౌరసత్వం జారీచేసే చేసే క్రమంలో నిజాయితీతో కూడా నూతన విధానాలను అనుసరిస్తున్నామని పేర్కొంది. ఈ సమయంలో దావూద్‌ ఇబ్రహీం విషయంలో వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని డొమినికా ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది.

దావూద్‌ ఇబ్రహీం పలు పేర్లతో వివిధ దేశాల పాస్‌పోర్టులను కలిగివున్నారనే వార్తలు ఈమధ్య వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పాకిస్థాన్‌, భారత్‌, దుబయ్‌, కామన్‌వెల్త్‌ ఆఫ్‌ డొమినికా వంటి దేశాల చిరునామాలతో వివిధ పాస్‌పోర్టులను కలిగివున్నాడనే ఆరోపణలూ ఉన్నాయి. ఇదిలాఉంటే, ఈ కరుడుకట్టిన నేరగాడి ఆస్తులు తమ దేశంలోనే ఉన్నాయని ఈ మధ్యే పాకిస్థాన్‌ అంగీకరిస్తూ అతడి చిరునామాలను పేర్కొన్న విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని