చాహర్‌.. నువ్వో యోధుడివి.. పోరాడేందుకే పుట్టావ్‌!   - Deepak chahars brother and sister wishes for his speedy recovery
close
Published : 30/08/2020 16:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చాహర్‌.. నువ్వో యోధుడివి.. పోరాడేందుకే పుట్టావ్‌! 

నీ ఆట కోసం ఎదురుచూస్తున్నాం: రాహుల్‌, మాలతీ 

ఇంటర్నెట్‌డెస్క్‌: దుబాయ్‌లో కరోనా బారిన పడిన చెన్నై సూపర్‌ కింగ్స్, టీమ్‌ఇండియా పేసర్‌ దీపక్‌ చాహర్‌ త్వరగా కోలుకోవాలని అతడి సోదరుడు, సోదరి ఆకాంక్షించారు. శుక్రవారం ఒక చెన్నై బౌలర్‌తో పాటు, పలువురు సహాయక సిబ్బందికి కరోనా సోకిందనే వార్త తెలియగానే ఎవరా ఆటగాడని ఆసక్తి మొదలైంది. అయితే, సామాజిక మాధ్యమాల్లో దీపక్‌ చాహర్‌ పేరు బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే శనివారం అతడి సోదరుడు, క్రికెటర్‌ రాహుల్‌ చాహర్‌, సోదరి మాలతి చాహర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే ఫొటో పంచుకొని వేర్వేరుగా భావోద్వేగ పోస్టులు చేశారు. అలాగే శనివారం సీఎస్కేకు చెందిన మరో బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ కూడా వైరస్‌ బారిన పడ్డాడని తెలిసింది. చివరికి శనివారం మధ్యాహ్నం బీసీసీఐ ఒక అధికారిక ప్రకటనలో మొత్తం 13 మందికి వైరస్‌ సోకిందని చెప్పింది. వారిప్పుడు ఐసోలేషన్‌లో ఉన్నారని, వైద్యుల బృందం పర్యవేక్షిస్తోందని పేర్కొంది. అయితే అందులో మాత్రం వారి పేర్లను బహిర్గతం చేయలేదు.

దీపక్‌ సోదరి, సోదరుడు ఏమన్నారు?

* నువ్వో నిజమైన యోధుడివి. పోరాడేందుకే పుట్టావ్‌. కటిక చీకటి తర్వాత వచ్చేది ప్రకాశవంతమైన రోజే. ఇంతకుముందు కన్నా మరింత దృఢంగా నువ్వు తిరిగి వస్తావని భావిస్తున్నా. త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. మళ్లీ నువ్వు మైదానంలో గర్జించడానికి ఎదురుచూస్తున్నా.    -మాలతీ చాహర్‌

* సోదరా.. ధైర్యం కోల్పోకుండా ఉండు. నువ్వు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. అలాగే ఆ భగవంతుడిని కూడా ప్రార్థిస్తున్నా.   -రాహుల్‌ చాహర్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని