డ్రగ్స్‌ కేసు: రేపు రకుల్‌‌.. ఎల్లుండి దీపిక! - Deepika Padukone to join NCB probe on Saturday
close
Updated : 24/09/2020 21:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్రగ్స్‌ కేసు: రేపు రకుల్‌‌.. ఎల్లుండి దీపిక!

ఎన్సీబీ ఎదుట హాజరుకానున్న తారలు

ముంబయి: హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మరణానంతరం డ్రగ్స్‌ వ్యవహారం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్న మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) తాజాగా ప్రముఖ హీరోయిన్లు దీపికా పదుకొణె, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌కు సమన్లు జారీ చేయడం కలకలం రేపింది. వారిని విచారించేందుకు ఎన్సీబీ అన్ని ఏర్పాట్లతో సిద్ధమవుతోంది. విచారణకు హాజరు కావాల్సిందిగా ఎన్సీబీ నుంచి తనకు సమన్లు అందినట్టు బాలీవుడ్‌ తార దీపికా పదుకొణె వెల్లడించారు. గోవాలో ఉన్న ఆమె ముంబయి బయల్దేరారు. శనివారం (ఈ నెల 26న) విచారణకు హాజరు కానున్నట్టు దీపిక తెలిపారని ఎన్సీబీ అధికారులు పేర్కొన్నారు. 2017లో తన మేనేజర్‌ కరిష్మాతో చాటింగ్‌కు సంబంధించి దీపికను విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కూడా తనకు సమన్లు అందాయని చెప్పినట్టు అధికారులు వెల్లడించారు. తొలుత ఎన్సీబీ ఇచ్చిన సమన్లు ప్రకారం రకుల్‌ ఈ రోజే విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, నిన్న ఆమెకు సమన్లు అందలేదని, అందుకే హాజరు కావడంలేదని ఆమె లీగల్‌ టీం తెలిపింది. తాజాగా సమన్లు అందడంతో శుక్రవారం ఆమె ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. రకుల్‌తో పాటు దీపిక మేనేజర్‌ కరిష్మాను కూడా విచారించనున్నట్టు అధికారులు వెల్లడించారు. నటి సారా అలీఖాన్‌ను కూడా ఎన్సీబీ అధికారులు ఈ నెల 26నే విచారించే అవకాశం ఉంది. దీంతో ఆమె కూడా గోవా నుంచి తన సోదరుడు, తల్లితో కలిసి ముంబయిలోని నివాసానికి చేరుకున్నారు. ఈ రోజు ఫ్యాషన్‌ డిజైనర్‌ సిమోనె కంబట్టా, సుశాంత్‌ మాజీ మేనేజర్‌ శ్రుతి మోదీని ఎన్సీబీ అధికారులు విచారించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని