
తాజా వార్తలు
మాజీప్రియుడి ఫొటోను డీపీగా పెట్టుకున్న దీపిక..!
అవాక్కైన నెటిజన్లు
ముంబయి: తన సోషల్‌మీడియా ఖాతాలన్నింటికీ మాజీ ప్రియుడి రణ్‌బీర్ కపూర్‌తో దిగిన ఓ ఫొటోని ప్రొఫైల్ పిక్‌గా ఉంచారు నటి దీపికా పదుకొణె. దీంతో ట్విటర్, ఇన్‌స్టా, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలు వేదికగా దీపికను ఫాలో అవుతున్న ఎంతోమంది అభిమానులు ఆమె పెట్టిన డీపీ చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఉన్నట్టుండి ఆమె ఈ విధంగా ఎందుకు చేశారా?అని అందరూ అనుకున్నారు. అయితే దీపిక తన ప్రొఫైల్ ఫొటోని మార్చడానికి కారణం లేకపోలేదు..!
ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఆమె నటించిన లవ్ డ్రామా ‘తమాషా’. 2015లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడమేగాక, రణ్‌బీర్-దీపికలకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో దీపిక.. ‘తార’ అనే అమ్మాయిగా నటించి సినీ ప్రేమికుల్ని ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమా విడుదలై(నవంబర్ 27) ఈ ఏడాదితో 5 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ‘తమాషా’ పోస్టర్ని దీపిక తన సోషల్‌మీడియా ఖాతాలకు డీపీగా మార్చారు. అంతేకాకుండా తన ప్రొఫైల్ పేరుని ‘తార’గా పెట్టారు. ఈ విషయం తెలిసిన కొంతమంది నెటిజన్లు ‘తమాషా’ సినిమాకి ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. మరికొంతమంది మాత్రం ఏం జరిగిందా? అని మాట్లాడుకుంటున్నారు.
గతంలో దీపికా పదుకొణె-రణ్‌బీర్ కపూర్ రిలేషన్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత మనస్పర్థలు తలెత్తడంతో వీరిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలోనే దీపికకు రణ్‌వీర్‌సింగ్‌తో పరిచయం ఏర్పడడం.. అది కాస్తా స్నేహంగా మారడం జరిగింది. అనంతరం ప్రేమలో పడిన రణ్వీర్-దీపిక 2018లో వివాహబంధంతో ఒక్కటయ్యారు.