డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరైన దీపికా పదుకొణె - Deepika Padukone reaches NCB office in drug case
close
Updated : 26/09/2020 13:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరైన దీపికా పదుకొణె


ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖ నటి దీపికా పదుకొణె,  శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌ మాదకద్రవ్యాల కేసులో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. గోవాలో ఉన్న దీపిక భర్త రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి గురువారం ముంబయి చేరుకుంది. శనివారం ఉదయం 9.45 గంటలకి ఆమె విచారణకు హాజరయ్యింది. అనంతరం శ్రద్ధాకపూర్‌, సారాఅలీఖాన్‌ హాజరయ్యారు. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి చెందిన తర్వాత బాలీవుడ్‌లో ప్రకంపణలు సృష్టించిన మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. 

డ్రగ్స్‌ కేసులో దీపికాకు ఎన్‌సీబీ అధికారులు బుధవారం సమన్లు జారీ చేశారు. ఆమెతో సహా బాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్లు శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌లకు కూడా సమన్లు పంపారు. రకుల్‌ శుక్రవారమే విచారణకు హాజరు కాగా అధికారులు ఆమెను 4గంటల పాటు ప్రశ్నించారు. ఆమె వాంగ్మూలాన్ని ఈ రోజు సిట్ ​రికార్డ్ చేసింది. అనంతరం దానిని విశ్లేషించి కోర్టుకు అందుజేయనున్నట్లు ఎన్‌సీబీ డైరెక్టర్‌
జనరల్‌ ముత అశోక్‌ పేర్కొన్నారు. దీపిక మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌, సుశాంత్‌ మాజీ మేనేజర్‌ శ్రుతి మోదీని కూడా అధికారులు శుక్రవారం విచారించారు. శనివారం మరోసారి హాజరు కావాలంటూ కరిష్మా ప్రకాశ్‌కు సమన్లు పంపగా ఆమె కూడా విచారణకు హాజరయ్యింది. 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని