దీపిక మేనేజర్‌ కనిపించడంలేదు: ఎన్‌సీబీ - Deepika Padukones manager is untraceable after summoned by NCB
close
Published : 03/11/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీపిక మేనేజర్‌ కనిపించడంలేదు: ఎన్‌సీబీ

ముంబయి: మాదకద్రవ్యాల కేసులో సమన్లు అందుకున్న బాలీవుడ్‌ అగ్ర నటి దీపిక పదుకొణె మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌ కనిపించడంలేదని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు వెల్లడించారు. బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ సమన్లకు ఎలాంటి స్పందన ఇవ్వలేదని పేర్కొన్నారు. నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసు విచారణలో మాదకద్రవ్యాల వినియోగం బయటపడింది. దీంతో పలువురిని ఎన్‌సీబీ అరెస్టు చేసింది. నటీమణులు దీపికా పదుకొణే, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌లతోపాటు పలువురికి అధికారులు సమన్లు జారీ చేశారు. అందులో దీపిక మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌ కూడా ఉన్నారు. ‘ఎన్‌సీబీ పంపించిన నోటీసులకు కరిష్మా ఇంతవరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఆమె స్పందించేవరకు ఎదురుచూస్తాం’ అని ఎన్‌సీబీ ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే పేర్కొన్నారు. గతంలో వెర్సోవాలోని కరిష్మా ప్రకాశ్‌ ఇంట్లో సోదాలు జరిపిన ఎన్‌సీబీ అధికారులు మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాలు జరిగినప్పుడు కూడా ఆమె ఇంట్లో లేరు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని