స్మార్ట్‌ కార్డుతోనే మెట్రో ప్రయాణం..! - Delhi Metro to begin from 7 Sep
close
Published : 30/08/2020 14:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్మార్ట్‌ కార్డుతోనే మెట్రో ప్రయాణం..!

టోకెన్లు ఉండవన్న దిల్లీ మెట్రో
తాజా మార్గదర్శకాలతో సర్వీసులకు సిద్ధం

దిల్లీ: అన్‌లాక్‌ 4.0లో భాగంగా తాజా మార్గదర్శకాలతో మెట్రో రైళ్ల సర్వీసులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దిల్లీ ప్రభుత్వం మెట్రో రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. కేవలం స్మార్ట్‌ కార్డులతోనే ప్రయాణానికి అనుమతిస్తామని ప్రకటించింది. మెట్రో రైలు టికెట్లలో భాగంగా ఇచ్చే టోకెన్ల‌ను ఇక నుంచి జారీచేయమని స్పష్టంచేసింది. కేవలం స్మార్ట్‌ కార్టులు, డిజిటల్‌ పేమెంట్‌ పద్ధతులతోనే ప్రయాణికులను అనుమతిస్తామని వెల్లడించింది. సెప్టెంబర్‌ 7వతేదీ నుంచి మెట్రో సేవలను పునఃప్రారంభిస్తామని దిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాష్‌ గహ్లోత్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా మెట్రోలో వెళ్లే ప్రయాణికులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రవేశ సమయంలో ప్రతి ప్రయాణికునికి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తామని దిల్లీ రవాణా మంత్రి స్పష్టం చేశారు. ఇదిలాఉంటే, సెప్టెంబర్‌ 7తేదీ నుంచి మెట్రో రైలు సర్వీసులను పునఃప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనిలోభాగంగా ఇప్పటికే ఆయా రాష్ట్రాలు స్టాడర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌(ఎస్‌ఓపీ)ను సిద్ధం చేసుకుంటున్నాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని