ఆ నివేదికలే నిదర్శనం: దేవినేని - Devineni Uma Fires On Ap Governament
close
Published : 26/09/2020 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ నివేదికలే నిదర్శనం: దేవినేని

అమరావతి: రాష్ట్రంలోని జలవనరుల ప్రాజెక్టులకు సంబంధించి తమదారి అడ్డదారి అన్నట్టు  వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు. పోలవరంలో ఎలాంటి అవినీతి లేదని కేంద్ర జలవనరుల శాఖ న్యాయస్థానానికి ఇచ్చిన నివేదికలే తమ పారదర్శకతకు నిదర్శనమన్నారు. శుక్రవారం దేవినేని మీడియాతో మాట్లాడుతూ.. 70శాతం పైగా పోలవరం ప్రాజెక్టు పనులను తెలుగుదేశం  ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. గత 16 నెలల్లో వైకాపా ప్రభుత్వం ఎంత మేర పనులు చేపట్టిందో సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై దిల్లీ పెద్దలను కలిశామని చెప్పిన సీఎం, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ దానిపై స్పష్టమైన ప్రకటన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పోలవరం అంచనా వ్యయం రూ.47వేల కోట్లపైచిలుకు అంటూ సొంత మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఉమా ఆరోపించారు. 

అధికారంలోకి వచ్చి 16నెలలు గడుస్తున్నా తమ అసమర్థత, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఇంకా తెదేపాపై నిందలు వేస్తున్నారని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగిల్‌ టెండర్‌ కోసం రివర్స్‌ టెండర్‌ డ్రామా ఆడి ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారని దేవినేని ధ్వజమెత్తారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. దాదాపు రూ.40 వేల కోట్లను సొంత వారికి కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా జలవనరుల నియమనిబంధనల్ని పక్కనపెట్టి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని దేవినేని ఆరోపించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని