పోరాట యోధుడిగా ధనుష్‌ వచ్చేస్తున్నాడు..! - Dhanushs Karnan shooting completed
close
Published : 09/12/2020 23:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోరాట యోధుడిగా ధనుష్‌ వచ్చేస్తున్నాడు..!

చెన్నై: తన నటనతో తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు తమిళ స్టార్‌ హీరో ధనుష్‌. ఆయన హీరోగా వస్తున్న ‘కర్ణన్‌’ చిత్రీకరణ పూర్తయింది. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. డైరెక్టర్‌ మారి సెల్వరాజ్‌తో కలిసి సినిమా సెట్లో ఉన్న ఓ ఫొటో పోస్టు చేసి.. సినిమా షూటింగ్‌ అయిపోందని వెల్లడించాడు. ఈ సినిమాలో ధనుష్‌ ఓ పోరాట యోధుడిగా కనిపిస్తారని సినీవర్గాల సమాచారం.  జులై 28న ధనుష్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఓ ప్రీలుక్‌ విడుదల చేసింది. ఆ లుక్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. ఈ సినిమాకు కలైపులి ఎస్‌.థాను నిర్మాత. సంతోష్‌ నారాయణ్‌ బాణీలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రం ‘అట్రంగి రే’లో ధనుష్‌ నటిస్తున్నాడు. అందులో బీటౌన్‌ స్టార్ నటులు అక్షయ్‌కుమార్‌, సారా అలీఖాన్‌ నటిస్తున్నారు. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని