యూట్యూబ్‌ టాప్‌10‌లో మూడు తెలుగు పాటలు - Dhee Champion in Youtube top 10 trending vedios in India
close
Published : 15/12/2020 02:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూట్యూబ్‌ టాప్‌10‌లో మూడు తెలుగు పాటలు

టాప్‌ 10లోనే ‘అల వైకుంఠపురములో’ రెండు పాటలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈటీవీలో ప్రసారమవుతోన్న దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద డ్యాన్స్‌ రియాలిటీ షో ‘ఢీ’. మరే ఇతర షోలకు సాధ్యంకాని విధంగా ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్మెంట్‌ అందిస్తూ అలరిస్తోంది. టీవీల్లోనే కాకుండా.. యూట్యూబ్‌లోనూ ట్రెండింగ్‌లో దూసుకెళుతోంది. ఒక ఎపిసోడ్‌ ముగుస్తుందో లేదో.. తర్వాతి ఎపిసోడ్‌ ప్రోమో కోసం యూట్యూబ్‌లో అభిమానులు వెతుకుతున్నారంటే.. ‘ఢీ’ అభిమానులకు ఎంతలా దగ్గరైందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా.. ‘ఢీ’ ఓ కొత్త రికార్డు సృష్టించింది. యూట్యూబ్‌ ఇండియా ప్రకటించిన టాప్‌ 10 వీడియోల్లో స్థానం సంపాదించింది.

యూట్యూబ్ ఇండియా టాప్ 10 ట్రెండింగ్ వీడియోలు, మ్యూజిక్ వీడియోలు, వాటి సృష్టికర్తలను ప్రకటించింది. అందులో.. ‘ఢీ ఛాంపియన్‌‘కు స్థానం లభించింది. ఢీ కంటెస్టెంట్‌ పండు చేసిన ‘నాదీ నక్కిలీసు గొలుసు’ ప్రదర్శన ఆరో స్థానంలో నిలిచింది. ఆగస్టు 5న యూట్యూబ్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ వీడియో ఇప్పటి వరకూ 81,528,169 వీక్షణలు సొంతం చేసుకుంది. కాగా.. ‘యూట్యూబ్‌ వర్సెస్‌ టిక్‌టాక్‌: ది ఎండ్‌’ అనే వీడియో అగ్రస్థానంలో నిలిచింది.

దీంతో పాటు టాప్‌10 మ్యూజిక్‌ వీడియోలను కూడా ప్రకటించింది. అందులో అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని రెండు పాటలకు చోటు దక్కింది. ‘బుట్టబొమ్మ’ మూడోస్థానంలో.. ‘రాములో.. రాములా’ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. కాగా.. అగ్రస్థానంలో జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ కనిపించిన హిందీ పాట ‘గేందా ఫూల్‌’ నిలిచింది. యూట్యూబ్‌ టాప్‌10 క్రియేటర్ల విభాగంలో హరియాణాకు చెందిన కేరీ మినాటి అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు.

ఇదీ చదవండి..

 

ప్రపంచం నాశనమైతే..? అందరికీ అదే దిక్కు

 


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని